బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి

Chandrababu-vasthu

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన అంటే.. ఇప్పుడు బిల్డింగులందు వాస్తున్న బిల్డింగులు వేరయా అంటున్నారు ఏపి మంత్రులు. వాస్తు పిచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఉందో అందరికి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు ఏపి సెకరటేరియట్ కు కేటాయించిన బ్లాక్ కు వెళితే మంచి జరగదు అని భావించి.. దాని ఎంట్రీ వేరే సైడ్ నుండి పెట్టించుకున్నారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు సర్కార్ మరోసారి వాస్తుదోషం పేరుతో వెలగపూడిలో చేస్తున్న నిర్వాకం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గదులు ఇరుకుగా ఉన్నాయని, వాస్తుదోషాలున్నాయని  వెలగపూడి లో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాల్లో కొన్ని గదులను కూల్చి వేసి మళ్ళీ నిర్మిస్తున్నారు. ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకుని ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీల్లో భారీ మార్పులు చేస్తున్నారు.  అన్ని భవనాలకంటే ముందుగా ప్రారంభించిన ఐదో బిల్డింగ్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేపట్టనున్నట్టు సమాచారం.

ఐదో బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులన్నింటినీ కూల గొట్టారు. ప్రతి మంత్రికి 225 అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఉండేలా మార్పులు  చేస్తున్నారు. ఈ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి  రూ.700 కోట్ల కేటాయించారు. హడావుడిగా నిర్మాణం ప్రారంభించారు . దీంతో అంతా లోపాల మయంగా మారింది . చివరికి   ఎవరికీ పనికిరాకుండా పోయింది. ఇప్పటికే తాత్కాలిక సెక్రటేరియట్ భవనం కుంగడం మీద పెద్ద దుమారమే రేగింది. మరి తాజాగా వాస్తు పేరుతో ఎంత డబ్బులు తగలేస్తారా అని సామాన్యులు ఆలోచిస్తున్నారు.

సెక్రటేరియట్, అసెంబ్లీలాంటి భారీ నిర్మాణ విషయంలో నారా చంద్రబాబు నాయుడులాంటి కాకలుతీరిన నాయకుడు కూడా తప్పటడుగులు వేస్తున్నారా..? లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. భారీ నిర్మాణాలను చేపట్టే సమయంలో వాస్తును, నిర్మాణ విలువలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేపడతారు. కానీ చంద్రబాబు మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోకుండా.. నిర్మాణం దాదాపుగా పూర్తికావస్తున్న టైంలో వాస్తు పేరుతో పునర్నిర్మాణం చేస్తామని అనడం ఎంత వరకు సమంజసం అంటూ చర్చ సాగుతోంది. తమ స్వంత ఇంటి నిర్మాణానికి కూడా ఇలా చేస్తారా..? ప్రజా ధనాన్ని వృధా చెయ్యడం కాకపోతే ఏంటిది..? అని విమర్శలు వినిపిస్తున్నాయి.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
అడకత్తెరలో కేసీఆర్
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
చెత్త టీంతో చంద్రబాబు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
పవన్ క్షమాపణలు చెప్పాలి
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
మోదీ భజన అందుకేనా?

Comments

comments