చినబాబుకు దీపావళి గిఫ్ట్!

Nara Chandrababu Naidu Diwali gift to Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగేతర శక్తిగా మారిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు త్వరలోనే దీపావళి గిఫ్ట్ అందుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ప్రస్తుతం ప్రజాప్రతినిధి కాకున్నా కూడా మంత్రి వర్గ భేటీల్లో మాత్రం పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు ఎంతో కాలంగా ఏపి కేబినెట్ లో కీలక పదవి కట్టబెడతారు అనే వార్త హల్ చల్ చేస్తోంది. అయితే అది ఎప్పుడు అనే దానిపై క్లారిటీ లేకుండాపోయింది. కానీ తాజాగా దీపావళి సందర్భంగా మాత్రం ఓ క్లారిటీ వచ్చేసింది.

దీపావళి నాడు వెలుగులు నింపడంలో భాగంగా నారా లోకేష్, ఆయన అనుయాయులకు ఆనందం పంచేలా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పండగ ఆఫర్ ప్రకటిస్తారు అని తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటా మ్యాటర్ అంటే ఇప్పటిదాకా నారా లోకేష్ ను మంత్రిగా తీసుకుంటారు అనే వార్తను నిజం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. దీపావళి సందర్భంగా చంద్రబాబు ఈ బంపరాఫర్ ను ప్రకటిస్తున్నారని సమాచారం. ఐటీ, పరిశ్రమల శాఖను నారా లోకేష్ కు కట్టబెట్టనున్నట్లు తెలుగు తమ్ముళ్లు  గుసగుసలాడుతున్నారు. మరి చూడాలి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ మీద నమ్మకంతో మంత్రి పదవి కట్టబెడతారో లేదా ప్రస్తుతం కాదు అని పక్కనపెడతారో చూడాలి.

Related posts:
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
తెలుగుదేశంలో ఆగష్టు భయం
అహా... అందుకేనా..?!
ఏపిలో జగన్ Vs పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఓటుకు నోటు కేసును మూసేశారా?
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments