చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?

Nara chandrababu Naidu may doubt on Nara Lokesh

తెలుగుదేశం పార్టీలో వింతలు, విశేషాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. తన కొడుకు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద మరోసారి ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన వ్యాఖ్యలతో అందరూ నారా లోకేష్ పనితనం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ మెత్త‌ప‌డ్డాడా?. ఆయ‌న ప‌నితీరు త‌న తండ్రికే న‌చ్చ‌డం లేదా?. ఇంత‌కి లోకేష్ చేసిన త‌ప్పెంటో అన్న చ‌ర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అసలు ఈ వ్యాఖ్యలు చెయ్యడానికి కారణం ఏమిటి.? చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం విజయవాడలో పార్టీ సయన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికలపై చర్చించారు. ఎన్నికలను డిసెంబర్‌ నెలాఖరులో జరపాలని తొలుత భావించినప్పటికీ, సంక్రాంతి పండుగ గడిచాక, అంటే జనవరి 20వ తేదీ తర్వాత నిర్వహించాలని నేతలందరూ కోరారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆ తదుపరి, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. గతేడాది 50 రోజుల్లో 55 లక్షల సభ్యత్వం జరిగిందనీ, ఈసారి ఆ రికార్డును అధిగమించాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారట‌. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రయోజనాలను పార్టీ యంత్రాంగం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం కార్యకర్తలకు సూచించారు.

అదే టైంలో చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు స్పీడ్ పెంచుకోవాలని సూచించారు. “కొంతమంది నేతలు చంద్రబాబే అన్నీ చూసుకుంటారులే అనే భావనలో ఉన్నారు. ఆ ఆలోచన కరెక్ట్ కాదు. లోకేశ్‌లో కూడా స్పీడు తగ్గింది. గతంలో ఏదైనా పనిచెబితే వెంటనే చేసేవాడు. ఇప్పుడు ఆ స్పీడు తగ్గింది. స్పీడు పెరగాలి..” అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సమావేశంలో సంచలనం రేకెత్తించాయి. నేను నా కుమారుడినైనా లెక్కచేయను. పార్టీ విషయంలో అందరూ స్పీడుగా, ప్రజల్లోకి చొరవగా వెళ్లాల్సిందే అని బాబు బ‌ల్ల‌గుద్ది చెప్పారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి వచ్చేవరకు నేను ఎవరినీ వదలను. అందరినీ పరుగెత్తిస్తూనే వుంటాను’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో తన కొడుకు లోకేష్ మీద చంద్రబాబుకు నమ్మకం పోయిందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
తెలుగుదేశంలో ఆగష్టు భయం
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
అహా... అందుకేనా..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments