నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు

Nara Family assets are too fake

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులను ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏ సందర్భంలేకున్నా ఆస్తులను ప్రకటించే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఈసారి కూడా అదే లెక్కన ఆస్తుల విలువతో సహా ప్రకటన విడుదల చేసింది. నారా లోకేష్ ఈ లెక్కలను వెల్లడించారు. ఈసారి కొత్తగా నారా దేవాన్షు కూడా కుటుంబంలో చేరడంతో… దేవాన్షు పేరుతో కూడా ఆస్తులున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. అయితే నారా లోకేష్ ప్రకటించిన ఆస్తుల మీద రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి.

నారా లోకేష్ చెప్పిన లెక్కలకు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువతో పోలీస్తే ఎక్కడా కూడా పొంతనలేదని విమర్శ వినిపిస్తోంది. మేనేజ్ చెయ్యడంలో డాక్టరేట్ అందుకున్న చంద్రబాబు తన కుటుంబ ఆస్తుల విషయంలోనూ అదే అద్భుతమైన మేనేజ్ మెంట్ చేశారని తెలుస్తోంది. గతేడాది ఆస్తులు, వాటి విలువకు, ఈ సంవత్సరం ప్రకటించిన ఆస్తులు, వాటి విలువకు ఎంత తేడా ఉందో కింద తెలుసుకోండి.

– 15 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో 25 లక్షలు పెట్టి కొన్న బిల్డింగ్ విలువను ఇప్పటికీ 25 లక్షలుగా నే చూపించారు. నిజానికి ప్రస్తుతం ఆ బిల్డింగ్ ధర మార్కెట్ ధరలో  50 కోట్ల విలువ ఉంటుంది. కానీ నారా లోకేష్ మాత్రం దాని  విలువ కేవలం 25లక్షలుగానే చూపిస్తున్నారు.
– హెరిటేజ్ ఫుడ్స్ లో భువనేశ్వరికి 5330826 షేర్లున్నాయి. నారా లోకేష్ ఆస్తులు ప్రకటిస్తున్న సమయంలో హెరిటేజ్ షేర్ ధర 902 రూపాయలు ఆ లెక్కన ఆమెకు హెరిటేజ్ ద్వారా వచ్చేది 480 కోట్లు. పోనీ స్టాక్ మార్కెట్ ఆటుపోటులను పరిగణలోకి తీసుకున్నా 400 కోట్ల విలువైతే ఉంటుంది.
– గతేడాది భువనేశ్వరి దగ్గర 3380 గ్రాముల బంగారం ఉన్నట్లు లెక్కలు చూపించారు. దాని విలువను 26.96 లక్షలుగా చూపించారు. కానీ ఈ ఏడాది ఆమె దగ్గర బంగారం 3519 గ్రాములు కానీ దాని విలువ మాత్రం 1.27 కోట్లుగా చూపించారు. 139 గ్రాముల బంగారం పెరిగితే ఏకంగా దాదాపుగా కోటి రూపాయలు పెరిగినట్లు ఎలా చూపిస్తారు?
– జూబ్లిహిల్స్ లో ప్లాట్ విలువను గతేడాది 2.36 కోట్లుగా చూపిస్తే ఈ ఏడాది మాత్రం 3.68 కోట్లుగా చూపించారు. కానీ జూబ్లిహిల్స్ లోని బిల్డింగ్ ను మాత్రం కొన్న విలువకే చూపించి.. ప్లాట్ ను మాత్రం మార్కెట్ వ్యాల్యూకు చూపించడం ఏంటో?
– మదీనగూడలో ఐదెకరాల భూమిని కొన్నానని, మరో ఐదెకరాలు నానమ్మ అమ్మణమ్మ గిఫ్ట్ గా ఇచ్చిందని లెక్కలు చూపించారు. పసుపు కుంకుమగా అర ఎకరం తప్ప ఎలాంటి ఆస్తులు లేని అమ్మణమ్మ ఐదెకరాల భూమిని ఎలా ఇచ్చింది?
– ముంబయి శివారులోని తన స్థలాన్ని మూడేళ్లపాటు 58.96 లక్షలుగా చూపించిన నారా లోకేష్ ఈ సారి మాత్రం దాన్ని అమ్మేసినట్లు ప్రకటించారు. కానీ ఎంతకు అమ్మారు..?ఆ డబ్బులు ఏమయ్యాయి అన్నది మాత్రం ఎందుకు పేర్కొనలేదు?
– నారా లోకేష్ కు హెరిటేజ్ ఫుడ్స్ లో 2366400 షేర్ల విలువను 2.21 కోట్లుగా చూపించారు. కానీ అసలు విలువ 212 కోట్ల వరకు ఉంటుంది.
– మాదాపూర్ లోని 924 గజాల ప్లాట్ విలువను గతేడాది 3.37 లక్షలుగా చూపిస్తే ఈ సారి మాత్రం 17 లక్షలుగా చూపించారు. నిజానికి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం దాని విలువ 80లక్షలు
– 97 కిలోల వెండి ధరను గతేడాి 3.3 లక్షలుగా చూపిస్తే ఈ సారి మాత్రం 12.37 లక్షలుగా చూపించారు. ఏడాదిలో వెండి ధర నాలుగు రెట్లు పెరిగిందా?
– జూబ్లిహిల్స్ లోని 1191 చదరపు గజాల స్థలం, దానిలో 19500 చదరపు అడుగుల భవనంను నారా దేవాన్షు పేరుతో చూపించారు. దాని విలువ 9కోట్లుగా చూపించారు. ఒక చదరపు అడుగు 1500లెక్కన వేసుకున్న 3 కోట్లు, స్థలం విలువ కనీసం 25 కోట్లు ఉంటుంది. మరి అంత విలువైన భూమిని 9 కోట్లకు ఎవరిచ్చారు?

ఈ లెక్కన చూస్తే నారా వారి ఆస్తుల లెక్కలు కట్టుకథలని, మీడియాలో చూపించుకోవడానికే అలా చేస్తున్నారని తెలుస్తోంది. తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని మీడియాకు చూపించిన నారా లోకేష్ తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తూ.. ఆస్తుల బంబోలజంబ చూపించారు అని జనాలు అనుకుంటున్నారు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
ఆ అరుపులేంటి..?
పట్టిసీమ వరమా..? వృధానా..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు

Comments

comments