నారా వారి అతి తెలివి

Nara family details in JNTU Exam paper

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని చిన్నప్పుడు చదువుకున్నాం. పుణ్యపురుషుల సంగతి పక్కన బెడితే అసలు ఎవరు ఎలా ఉన్నా తాము మాత్రం అదో లోకం అనే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ల జాబితాలో చంద్రబాబు సర్కార్ లోని వాళ్లను ఉంచాలి. అవును పైత్యం ఎక్కువైతే కళ్లు తిరిగి ఏం జరుగుతుందో తెలియదు. అలాగే సర్కార్ లో ఉన్న వాళ్లకు పైత్యం ఎక్కువైతే ప్రశ్నాపత్రం కరపత్రంలా మారుతుంది. అవును విద్యార్థులకు అందించే ప్రశ్నాపత్రం తెలుగుదేశం పార్టీ కరపత్రంలా మారింది. ఏపిలో చంద్రబాబు హవా ఈ లెవల్ లో నడుస్తుంది అని నిరూపించడానికో లేదంటే ఎవరి మెప్పు పొందడానికో తెలియదు కానీ ప్రశ్నా ప్రతంలో నారా వారి ఫ్యామిలీ డిటేయిల్స్ రావడం అందరికి ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ఏపిలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ లైన్ చదవగానే అంతా అద్భుతం, అమోఘం జరుగుతోంది అని అనుకుంటున్నారేమో. అదేం కాదు. అది కేవలం మీ ఊహ మాత్రమే. బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు సోమవారం నిర్వహించిన మేనేజిరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలసిస్ పేపర్ లో ఎవరూ ఊహించని ప్రశ్నలు ప్రత్యక్షమయ్యాయి. అవును… సెలబస్ లో లేని ప్రశ్నలు అడిగుంతారు అని అనుకుంటారేమో.. కాదు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరుతో ప్రశ్నలు సంధించడం జరిగింది. లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ పేర్లతో కూడిన ప్రశ్నలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.

chandrababu-papers

కాగా దీనిపై జెఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సుబ్బారావు పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఈ మొత్తం వ్యవహారం మీద చాలా మంది నాయకులు జోకులు వేస్తున్నారు. ఇంకా నయం నారా దేవాన్షు పుట్టినప్పుడు బరువెంత? నారా లోకేష్ బిఎంఐ ఎంత? నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏంటీ అని ప్రశ్నలు రాలేదు సంతోషించండి అంటూ కామెడీ చేస్తున్నారు. పాపం చంద్రబాబు సర్కార్ లో ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడంలేదు. రాత్రి పగలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నానంటూ చంద్రబాబు చెప్పేమాటలకు కాసింత కామెడీని యాడ్ చేసి ఈ ప్రశ్నాపత్రాలను తయారుచేసి ఉంటారు అని మరికొందరి భావన. మొత్తానికి జెఎన్టియు ప్రశ్న పత్రంలో ప్రశ్నలు బాగా పేలాయి.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
ప్యాకేజీ కాదు క్యాబేజీ
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
2018లో తెలుగుదేశం ఖాళీ!
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
ఏపీకి ఆ అర్హత లేదా?
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
బంగారం బట్టబయలు చేస్తారా?
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు

Comments

comments