లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?

Nara Lokesh even not fit for heir

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరుంది. రాజకీయ నీతి కలిగిన మేధావిగా, టెక్నాలజీ ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకునే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.

తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావు(సీనియర్) రక్తం పంచుకున్న వారసుడు కాకున్నా కూడా రాజకీయ వారసుడిగా చంద్రబాబు విజయవంతమయ్యాడు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నడిపించే వారసుడి కోసం చంద్రబాబు నాయుడు వెతుకుతున్నారు.. వేరే ప్రత్యామ్నాల కోసం అన్వేషిస్తున్నారు అనే వార్త రాజకీయ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటి నారా చంద్రబాబు నాయుడుకు వారసుడు లేకపోవడం ఏంటి..? నారా లోకేష్ ఉన్నాడు కదా.. పైగా తెలుగుదేశం పార్టీలో ఆయనకు పెద్ద పీట వేస్తున్నారు కదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి కదా. వాటన్నింటికి ఈ ఆర్టికల్ లో సమాధానమిస్తున్నాం.

నారా లోకేష్ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు రాజకీయాల్లో వచ్చినా ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం పాల్గొనలేదు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా పోటీచెయ్యలేదు. కానీ కేబినెట్ సమావేశాల్లో మాత్రం సిఎం ముందు కూడా కూర్చుంటారు. ఇక నారా లోకేష్ చాలా సంవత్సరాల నుండి పార్టీలో క్రియాశీలంగా కనిపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆశించిన స్థాయిలో మాత్రం నారా లోకేష్ పనితీరు మెరుగుపడలేదు. అందుకే తాజాగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను వారసుడిగా అంగీకరించలేక.. వారసుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారని పార్టీలో వినికిడి. నారా లోకేష్ ఎందుకు వారసుడిగా పనికి రాడు అని అనుకుంటున్నారు?

నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా నారా చంద్రబాబు నాయుడు నియమించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించడంలో, పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టపరచడంలో కూడా లోకేష్ ఎంతో కృషి చేస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తిరిగి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో కూడా లోకేష్ తన మార్క్ వెయ్యలేదని బాబు అసహనంగా ఉన్నారని అప్పుడు వార్తలు వచ్చాయి. దాంతో చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వ నమోదు మీద ప్రత్యేక శ్రద్ధ వహించి.. క్యాడర్ ను ప్రోత్సహించాల్సి వచ్చింది.

ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నారా లోకేష్ మంచి సంబంధాలు కొనసాగిస్తాడు అనుకుంటే అలాంటిది కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం భీమా ప్రవేశపెట్టి.. అది నారా లోకేష్ ఆలోచన అని చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇచ్చారు. అయినా కూడా కార్యకర్తల్లో మాత్రం నారా లోకేష్ మీద నమ్మకం మాత్రం కలగలేదు. అన్నింటికి మించి తెలంగాణలో ఎంతో కీలకమైన జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో నారా లోకేష్ తీరు పెద్దగా పార్టీకి లాభించలేదని చంద్రబాబు బేరీజు వేసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా నారా లోకేష్ విదేశాల్లో యువతులతో దిగిన అసభ్య ఫోటోలు కూడా ఆయనకు నెగిటివ్ మార్క్ తీసుకువచ్చింది.

ఇలా అన్నింటా నారా లోకేష్ పర్ఫామెన్స్ ను బేరీజు వేసుకున్న నారా చంద్రబాబు నాయుడు చివరకు తన వారసుడిగా సరిపోడు అని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా నారా లోకేష్ భార్య, తన కోడలు నారా బ్రాహ్మణి పేరును తెర మీదకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా అంశాల్లో విఫలమైన నారా లోకేష్ చివరకు నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా కూడా పనికిరాకుండా పోయాడా..? అని కొంత మంది గిట్టని వాళ్లు వెటకారంగా మాట్లాడుతున్నారు.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
ఎవరు చాణిక్యులు..?
మూడింటికి తేడా ఏంటి..?
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments