లోకేష్ మంత్రికాకపోతే అదే భయం

Nara Lokesh need Ministry for that reason

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు చాలాకాలం నుండి ఓ భయం పట్టుకుందట. లోకేష్ కు మంత్రి పదవి ఇప్పుడు అంటే ఇప్పుడు అని వార్తలు చాలా వచ్చాయి. దసరా నాటికి లోకేష్ మంత్రి అని, దీపావళి నాటికి మినిస్టర్ గా లోకేష్ అని రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నారా చంద్రబాబు నాయుడు మాత్రం దీని మీద ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.ఇప్పటికీ చంద్రబాబు ఈ విషయంపై కాస్త ఆలోచనలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చినబాబు ఇంతలా భయపడుతున్నారంటే దానికీ ఓ కారణం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ నారా లోకేష్ అంతలా భయపడటానికి కారణం ఏంటి అనుకుంటున్నారా..? చినబాబు పనితీరుపై అందరికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఏపిలో చినబాబు ఎంతలా తన బలాన్ని పెంచుకుందామనుకున్నా కానీ అది వర్కవుట్ కావడంలేదు. కనీసం ఎన్నికల టైంలో అయినా మంచి మార్కులు కొట్టేద్దామంటే అది ఆకాశంలో నిచ్చెలు వేసినట్లైంది. కనీసం లోకేష్ ఊసులేకుండాపోయింది. ఏపిలో వైయస్ జగన్, తెలంగాణలో కేటీఆర్ లు మంచి మార్కులు కొట్టేసి ఇప్పటికే ఫాంలో ఉన్నారు.

తెలంగాణలో కేటీఆర్ ను, ఏపిలో వైయస్ జగన్ ను బీట్ చేయడానికి ఇలా మంత్రి పదవి చేపట్టాలని అనుకుంటున్నారట. అందుకే మంత్రి పదవి చేపట్టి తన మార్క్ వేసి, అలా మంచి మార్కులు కొట్టేయాలని పెద్ద స్కెచ్ వేశారట. ఒకవేళ తాను మంత్రి పదవి దక్కించుకుని, తన మార్క్ వెయ్యలేని పక్షంగా అందరూ తనను అసమర్థుడిగా చేస్తారు అనే భయం పట్టుకుందట లోకేష్ కు. చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2 కోసం తహతహలాడుతున్న నారా లోకేష్ మరి ఆ దిశగా మంత్రి పదవి దక్కించుకుంటాడో లేదో? అయినా మంత్రి పదవి ఉంటేనే తన పర్ఫామెన్స్ చూపిస్తాడు అని అనుకునే వాళ్లకు దాని మీద ఎంత వరకు నమ్మకం ఉందో మరి.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
నింద్రాప్రదేశ్
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
పవర్ లేని పవర్ ?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments