వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..

nara Lokesh open letter to YS Jagan

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు టీడీపీ యువనేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన సాక్షి పత్రికపై ధ్వజమెత్తారు. సాక్షి పత్రికలో కథనాలు ఎంత అవాస్తవమో, అభూత కల్పనలో 7-10-2016న ప్రచురించిన వార్త ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. ‘జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ లో “కోర్ డ్యాష్ బోర్డుపై ప్రజెంటేషన్” ఇస్తున్న సమయంలో కూన రవికుమార్ గారు వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను, పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప గారు వివరణ ఇస్తూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశామన్నారు. ఇందులో నేను బెదిరించడం, చినరాజప్ప గారు భయపడటం అనేదానికి ఆస్కారమే లేదు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.

‘నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుందిగానీ నాపై దుష్ప్రచారం చేస్తే, నన్ను చూసి అసూయపడితే మీకు భవిష్యత్తు ఉండదన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ తో పని చేసిన మంత్రులు, సహచరులపై సాక్షిలో తప్పుడు కధనాలు ప్రచురించిన ఘనత జగన్ దని’ఆయన ఆరోపించారు. కాగా, హాం మంత్రి చినరాజప్పపై లోకేష్ ఫైరయ్యాడంటూ సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా సాక్షి వెలువరించింది.

‘చినరాజప్పతో నాకు ఉన్నది అభిమానపూర్వక సంబంధాలేగాని, మీరు వక్రీకరించి రాసిన సంబంధాలు కాదు. మీ తండ్రితో పాటు పని చేసిన సీనియర్ నాయకులను, మంత్రులనే అగౌరవపరచి, అవమానపరిచిన చరిత్ర మీది. అందుకే వారిలో చాలామంది మిమ్మల్ని, మీ పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్లారు. మీ అహంకారాన్ని, లెక్కలేనితనాన్ని, అబద్ధాలను భరించలేకే పార్టీని వీడుతున్నామని స్పష్టంగా చెప్పారు. సంస్కారం గురించి, పెద్దలను గౌరవించడం గురించి నాకు నేర్పేది మీరా?’ అంటూ లోకేశ్ ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. ‘నా పైన, మా పొలిట్ బ్యూరో సభ్యులు చిన రాజప్ప పైన దుష్ప్రచారం చేసినందుకు మీ పత్రిక తరపున మీరు బహిరంగ క్షమాపణ చెప్పి తప్పును సరిచేసుకోవాల్సిందిగా కోరుతున్నా’ అన్నారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
ఆట ఆడలేమా..?
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
గెలిచి ఓడిన రోహిత్ వేముల
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
సల్మాన్ ను వదలని కేసులు
బిచ్చగాళ్లు కావలెను
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్

Comments

comments