లోకేషా.. ఏంటీ ఆ మాటలు

Nara Lokesh shocking answer to Students about his photos with foreign girls

నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకుగా నారా లోకేష్ కు గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో నెంబర్ టూగా ఎదిగేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు లోకేష్. కాగా ఇప్పుడిప్పుడే ఎదుగుదామని అనుకున్న లోకేష్ కు తిప్పలు తప్పడ్డం లేదు. నారా లోకేష్ మాట్లాడే ప్రతి మాట ఆయనకు శరాఘాతంగానే మారుతోంది. ఇప్పటికే అయ్యవారి బూతు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, తాజాగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

చంద్రబాబు కొడుకు నారా లోకేష్ చదువులు విదేశాల్లో జరిగాయి. అక్కడి వాతావరణానికి బాగానే లోకేష్ అలవాటుపడ్డాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ విదేశీ పోకడలు కుదరడంలేదు. అయితే అయ్యవారు విదేశీయులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో  హల్ చల్ చేశాయి. నారా లోకేష్ గారి ఘన కార్యం చూడండి అంటూ చాలా మంది లోకేష్ ఫోటోలు చూపించి దుమ్మెత్తిపోశారు కూడా. అయితే నారా లోకేష్ నిన్నటి దాకా దీనిపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం దానిపై స్పందించారు.

తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారికి దిమ్మతిరిగిపోయేలా లోకేష్ సమాధానమిచ్చారు.  మీరు ఫారిన్‌ గర్ల్‌ల్స్‌తో తిరిగారనే ప్రచారం జరుగుతోంది.. అది నిజమా?’ అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా లోకేష్ 2006లో స్టాన్‌ ఫర్డ్‌ నుంచి వచ్చిన మిత్రులందరితో కలసి 20 రోజుల పాటు దేశమంతా తిరిగినట్లు తెలిపారు. ఆ టైంలో ఓ ఐదారు వందల ఫొటోలు దిగానని, అయితే అందులోంచి మూడు ఫొటోలే ’సాక్షి’ పత్రికలో వేశారని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అసలు నారా లోకేష్ విద్యార్థులతో ఇలా మాట్లాడటం ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఓ రకంగా విద్యార్థులకు ఇలా చెయ్యడం అంటూ సంకేతాలివ్వడమే అని చర్చసాగుతోంది. పాపం లోకేష్ బాబు బాధ అంతా కేవలం మూడు ఫోటోలు మాత్రమే వచ్చాయని కావచ్చు.. అయినా మూడు ఫోటోల్లోనే అయ్యవారి లీలలు చూడలేక జనం అల్లాడిపోయారు. ఇక అన్ని ఫోటోలు వచ్చి ఉంటేనా?!

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
ఆరిపోయే దీపంలా టిడిపి?
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
స్టే ఎలా వచ్చిందంటే..
ఏపీ బంద్.. హోదా కోసం
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
గెలిచి ఓడిన రోహిత్ వేముల
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
చంద్రబాబు చిన్న చూపు
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
అమ్మను పంపించేశారా?

Comments

comments