లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును

Nara Lokesh started Garrage to repair TTDP in NTR Bhavan

తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి తెలుగువాడికి ముందు నుండి పరిచయం ఉన్న పేరు. ప్రస్తుతం ఓ రాష్ట్రంలో ఫుల్ స్వింగ్ లో మరో రాష్ట్రంలో కాస్త డల్ గా ఉంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన తర్వాత కొన్ని మార్పులు తీసుకువచ్చారు. పార్టీని అధునికతవైపు పరుగులు తీయించారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి తీసిపోని ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశంను తీర్చిదిద్దారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పార్టీ ప్రభ తగ్గింది. దాంతో సిఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తాజాగా గ్యారేజ్ ఓపెన్ చేసినట్లు పక్కా సమాచారం తెలిసింది. జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఇప్పుడు పార్టీనిగాడిన పెట్టే పనికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా లీనం కాలేదు అనే విమర్శలకు తావివ్వకుండా.. పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ గా మారుతున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో లోకేష్ ప్రతిపాదించిన కొన్ని కీలక అంశాలను అప్పటికప్పుడు మహానాడు ఓకే చేసింది. ముందుగా పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది లోకేష్ తీసుకువచ్చిన ప్రతిపాదననే అని, ఆ క్రెడిట్ ను మహానాడు సాక్షిగా లోకేష్ కు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు.

గతకొంత కాలంగా టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కుదేలైంది. దాదాపుగా పార్టీ ముఖ్య నేతలు అంతా కూడా కారెక్కి… సైకిల్ ను రిపేర్ కు పంపిచేశారు. దాంతో పార్టీని తిరిగి లైన్ లో పెట్టేందుకు లోకేష్ తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో గ్యారేజ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు సలహా మేరకు లోకేష్ రంగంలోకి దిగారు. అందులో భాగంగా ముందుగా సీనియర్ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అందులో మొదటి మీటింగ్ లోనే చాలా మంది నాయకులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారట. దాంతో లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ మీద దృష్టి పెట్టాలి అంతే కానీ ఏంటిది..? ఏమైనా సమస్యలు ఉంటే పర్సనల్ గా కలిసి నాతో మాట్లాడండి అని కూడా అన్నారట.

టిఆర్ఎస్ దెబ్బతో దాదాపుగా ఖాళీ అనే బోర్డ్ పెట్టేదాకా వెళ్లిన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి లోకేష్ ఎలా రిపేర్ చేసి తిరిగి ఫాంలోకి తీసుకువస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మినహా ఎవరూ ప్రభావశీలంగా లేరు. ఉన్న సీనియర్లు పెద్దగా పార్టీనిపట్టించుకునే స్థాయిలో లేరు. మరి ఇన్నిమైనస్ ల మధ్య లోకేష్ ఎలా ప్లస్ చేయిస్తారు అనేది చూడాలి.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ఇదే జగ‘నిజం’
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ప్రత్యేక హోదా లాభాలు
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments