నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..

Nara Lokesh told balakrishna dailouges

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుత్రరత్నం నారా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా చాలా మంది నాయకులు టిడిపి నుండి వైసీపీ పార్టీలోకి చేరుతూ తెలుగు తమ్ముళ్లలో కలవరంరేపుతున్నారు. అయితే వైసీపీలో వలసలు, టిడిపి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ జగన్ కి ఓ సవాల్ విసిరారు. జగన్ తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అయన ఆంధ్రప్రదేశ్ కి వచ్చి అభివృద్ధిని చూడాలని అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, స్థలం, సమయం జగన్ నిర్ణయించుకోవాలని లోకేష్ చెప్పారు.

అంతేకాకుండా జగన్ కు సంబందించిన ఒక పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరమని, జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కనపడట్లేదని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సరైన ముఖ్యమంత్రి ఉన్నారు కానీ సరైన ప్రతిపక్ష నాయకుడు లేడని అన్నారు. జగన్ కు రాష్ట్రం గురించి కనీస అవగాహన కూడా లేదని లోకేష్ విమర్శించారు.మొత్తానికి నారా లోకేష్ కూడా వార్తల్లో వచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా తన మామయ్య బాలకృష్ణ డైలాగ్ కొడుతున్నారని చాలా మంది అంటున్నారు. పాపం.. జగన్ కు చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అవగాహన లేనందుకే ప్రజల ముందు బాబును దోషిగా నిలబెడుతున్నారని జోకులు కూడా వేస్తున్నారు రాజకీయ విమర్శకులు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
ఆట ఆడలేమా..?
ఓడినా విజేతనే.. భారత సింధూరం
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
సన్మానం చేయించుకున్న వెంకయ్య
గెలిచి ఓడిన రోహిత్ వేముల
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
నారా వారి అతి తెలివి
ఆ సిఎంను చూడు బాబు...
ఏపీకి ఆ అర్హత లేదా?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
మోదీ ఒక్కడే తెలివైనోడా?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
500 నోటుపై ఫోటో మార్చాలంట
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
గుదిబండగా మారిన కోదండరాం

Comments

comments