ఏపి సిఎంగా నారా లోకేష్

Nara Lokesh will be Andhra Pradesh Chief Minister

అవును.. మీరు చదువుతున్నది అక్షర సత్యం. చంద్రబాబు నాయుడు బదులుగా నారా లోకేష్ అని తప్పుగా రాశారని అనుకుంటున్నారేమో కానీ కాదు. నారా చంద్రబాబు నాయుడు పుత్రరత్నం నారాలోకేష్ ను ఏపి సిఎంగా చేస్తారు అనే వార్త చాలా రోజుల నుండి వినిపిస్తోంది. అయితే అంతకు ముందు ఆయనను మంత్రిని చెయ్యాలని అనుకుంటున్నట్లు కూడా ఓ వార్త వచ్చింది. అయితే తాజాగా మాత్రం నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసేస్తున్నారని… అయితే అది కేవలం ఆ నాలుగు రోజులు మాత్రమే అనే వార్త అందరికి ఆశ్చరయాన్ని కలిగిస్తోంది. మరి ఆ నాలుగు రోజులు ఏంటి? నారా లోకేష్ ను సిఎంను చెయ్యడం ఏంటి అనే మ్యాటర్ తెలియాలంటే మొత్త ఆర్టికల్ చదవాల్సిందే.

ఒక్క రోజు ముఖ్యమంత్రి గురించి సినిమాల్లో చూశాం.. కానీ నాలుగు రోజుల సిఎం గురించి ఎన్నడూ వినలేదే? అని అనుకుంటున్నారేమో? తాజాగా నారా లోకేష్ ఇప్పుడు ఆ నాలుగు రోజుల ముఖ్యమంత్రిగా మారుతున్నారు అంటూ మెసేజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే నారా లోకేష్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే వార్త అందరికి తెలిసిందే. కాగా ఏపి సీఎం చంద్రబాబు త్వరలో విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు(10-13 డిసెంబర్, 2016) కువైట్ తో పాటు అరబ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయనతో పాటు 15 మంది బృందం కూడా పర్యటించనుంది. వాణిజ్య వ్యవహారాలు..ఇన్ ఫ్రా ప్రాజెక్టుల్లో ఉమ్మడి పెట్టుబడులపై బృందం అధ్యయనం చేయనుంది.

అయితే ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు వెళితే లేదంటే విదేశీ పర్యటనలకు వెళితే కేబినెట్ లోని మంత్రుల్లో ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తుంటారు. కానీ బాబు మాత్రం తన తనయుడైన లోకేష్ కు అనధికారికంగా సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు టాక్. కుర్చీలో కూర్చొకపోయినా సీఎం బాధ్యతలన్నీ లోకేష్ చూస్తారని ప్రచారం. మంత్రులు ఎవరైనా ఈ నాలుగు రోజులు నారా లోకేష్ ను సిఎంగా చూసుకోవాలని, అందుకు తగ్గట్టుగా అన్ని జరగాలని చంద్రబాబు స్కెచ్ వేసినట్లు గాలివార్త. అయితే సిఎంగా నారా లోకేష్ ఈ నాలుగు రోజులు మాక్ డ్రిల్ చేస్తున్నారని కొంత మంది జోకులు వేసుకుంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం నారా లోకేష్ కు రాజయోగం ఉందని గత కొంత కాలంగా వార్త వినిపిస్తోంది. అయితే తాజాగా చంద్రబాబు టూర్. అదే టైంలో నారా లోకేష్  సిఎంలాగా వ్యవహరించడం.. ఇవన్నీ చూస్తుంటే బహుశా అలాంటి సంకేతాలనిస్తున్నాయనిపిస్తోెంది.

Related posts:
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments