మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!

Narayana said that had to hang Modi on demonetisation

దేశంలో పెద్ద నోట్ల బ్యాన్ తర్వాత పరిస్థితి అంతకంతకు దారుణంగా మారుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఏకీభవించినా కానీ కొంత మంది మాత్రం వ్యతిరేకించారు. అయితే మోదీ తీసుకున్న నిర్ణయానికి కొంచెం కొంచెంగా వ్యతిరేకత వస్తోంది. అయితే నిన్న మొన్నటి దాకా ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీలు ఇప్పటికే మోదీ మీద దుమ్మెత్తిపోస్తుండగా తెలుగు తేజం, కమ్యూనిస్టు నాయకుడు సిపిఐ నారాయణ ఏకంగా ఉరి తియ్యాలని అంటున్నారు.

నిరుపేదలు కష్టపడి దాచుకొన్న డబ్బుకి విలువ లేకుండా చేసిన మోడీ ఒక శాడిస్ట్ అని ఆయన ప్రభుత్వం ఒక శాడిస్ట్ ప్రభుత్వమని నారాయణ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న నోట్లకి ఆ విలువ ఉంటుందని ఆ బ్యాంక్ గవర్నర్ ప్రతీ నోటుపై సంతకం చేసి హామీ ఇచ్చినవి చెల్లవని మోడీ చెప్పడానికి ఆయన అధికారమే లేదని అన్నారు. ఈ నోట్ల రద్దు కారణంగా దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోట్లాది ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని తిట్టుకొంటూ ఉండవచ్చు. కానీ అంతే మంది ఆయన నిర్ణయాన్ని మెచ్చుకొంటున్నారు కూడా. ఈ నిర్ణయం అమలు కంటే, దాని తదనంతర పరిస్థితులని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేకపోవడం వలననే అందరూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని వేలెత్తి చూపగలుగుతున్నారు. అదే ఈ సమస్యలేవీ లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి ఉండి ఉంటే నేడు నారాయణ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారు ప్రధాని నరేంద్ర మోడీని ఈవిధంగా విమర్శించి ఉండగలిగేవారా?

Related posts:
ఇదో విడ్డూరం
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
పెట్రోల్ లీటర్‌కు 250
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
మంత్రుల ఫోన్లు బంద్
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
వార్దాకు వణికిపోతున్న చెన్నై
అతి పెద్ద కుంభకోణం ఇదే
రాసలీలల మంత్రి రాజీనామా
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
కాంగ్రెస్ నేత దారుణ హత్య
ఏపికి యనమల షాకు

Comments

comments