గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్

Narendra Modi indirectly kills rural cooperative banks

అవును, మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం. నరేంద్ర మోదీగారు ఎంతలా ప్రజలకు మంచి చేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చినా కానీ తెర వెనక మాత్రం పెద్ద తతంగమే నడుస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీమానిటైజేషన్(పెద్దనోట్ల రద్దు నిర్ణయం) వెనక అందరూ బ్యాంకుల మీదపడుతున్నా అసలు మోదీ సర్కార్ చూపించిన పక్షవాత వైఖరి ఏంటో తెలిస్తే బ్యాంకుల్లో కూడా ఇంత మతలబు జరిగిందా? అని నోరెళ్లబెడతారు. కార్పోరేట్ కు కొమ్ముకాయడంలో నరేంద్ర మోదీ కూడా తక్కువ తినలేదు అనే విషయాన్ని చాలా క్లీయర్ గా ఈ ఉదంతంతో అర్థంచేసుకోవచ్చు.

పెద్దనోట్ల రద్దు తర్వాత భారీగా నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. పలానా బ్యాంక్ అని కాదు.. అన్ని బ్యాంకుల్లోకి డబ్బులు కోట్లకొద్ది వచ్చిచేరింది. అందులో ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు కూడా ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ కోపరేటివ్ బ్యాంకుల్లో కాస్త తక్కువ నగదు డిపాజిట్ అయింది. అయితే ఆర్బీఐ కొత్త నోట్లను విడుదల చేసే టైంలో కార్పోరేట్ వత్తిడికి తలొగ్గి, ప్రభుత్వ సూచనల మేరకు తమకు కావాల్సిన కార్పోరేట్ బ్యాంకులకు మాత్రమే నగదును సరఫరా చేశారు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో జనాలు డబ్బుల కోసం చాలా ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో అక్కడే ముందుగా డబ్బులను సప్లై చెయ్యాలి. కానీ అలా జరగలేదు. ఇది ఓ రకంగా మోదీ సర్కార్ అవినీతి అంతం ముసుగులో చేసిన అతిపెద్ద తప్పు అని అనుకోవచ్చు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన గ్రామీణ బ్యాంకులను, కార్పోరేట్ వత్తిడి మూలంగా గాలికి వదిలెయ్యడం అంటే వాటిని ఓ రకంగా ఖూనీ చెయ్యడమే. మరి మోదీ గారు కనీసం ఇప్పటికైనా ఈ అంశాన్ని గమనించి తప్పును సరిదిద్దుతారేమో చూడాలి.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
తాగుబోతుల తెలంగాణ!
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
బాకీలను రద్దు చేసిన SBI
మోదీ హీరో కాదా?
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
ట్రంప్ సంచలన నిర్ణయం
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
వాళ్లకు ఇదే చివరి అవకాశం
బంగారం బట్టబయలు చేస్తారా?
వంద విలువ తెలిసొచ్చిందట!
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

Comments

comments