అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?

Narendra Modi one more shock to people

మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద దేశంలో రకరకాలుగా వాదనలు సాగుతున్నాయి. డీమానిటైజేషన్ వల్ల దేశంలో కరెన్సీ కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే డిసెంబర్ 30తేది తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుంది అని అందరూ ఊహిస్తుంటే తాజాగా సర్కార్ మాత్రం షాకిచ్చింది. ఈ నెల 30 తర్వాత కూడా నగదు విత్ డ్రా పై ఆంక్షలు కొనసాగుతున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సరిపడా నోట్లు అందుబాటులో లేకుండా డబ్బు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేయలేమని చెప్పేసింది. ఒక్కసారిగా షరతులు ఎత్తివేస్తే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదాలా ఉంటే ఇప్పటివరకు వారానికి రూ.24 వేల నగదు వరకు విత్ డ్రా చేసుకునే ఉంది కానీ అది ఎక్కడా కూడా అమలు కావడం లేదు. బ్యాంకుల్లో కూడా సరిపడా డబ్బు కూడా ఉండటం లేదు. ఎదో ఉన్నదాంట్లో లేదనకుండా సరిపుచ్చుతున్నారు అధికారులు. ఈ పరిస్థితుల్లో గనుక ఆంక్షలు ఎత్తివేస్తే కోరిమరీ ఇబ్బందులు తెచ్చుకున్నట్టేని ఆర్బీఐ ఆలోచిస్తుంది. ఉన్నపలంగా పరిమితులను ఎత్తివేస్తే చిరువ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున డబ్బును కోరితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దీంతో ఆంక్షలను కొనసాగించడమే మంచిదని నిర్ణయం తీసుకుంది. నగదు లభ్యత పెరిగే కొద్దీ ఆంక్షలను కూడా క్రమంగా సడలిస్తూ వెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చారు.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మావో నాయకుడు ఆర్కే క్షేమం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
రాసలీలల మంత్రి రాజీనామా
వాళ్లకు ఇదే చివరి అవకాశం
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
ఏపికి యనమల షాకు

Comments

comments