మంత్రుల ఫోన్లు బంద్

narendra Modi shocks Cabinet ministers

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి షాకిచ్చారు. మంత్రివర్గంలో ఉంటున్న వారి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్న మోదీ తాజాగా ఓ షాకిచ్చారు. మంత్రులెవరు మంత్రివర్గ సమావేశానికి మొబైల్స్, ల్యాప్ ట్యాప్ లాంటివి తీసుకురాకూడదు అని హుకుం జారీ చేశారు. సర్జికల్ స్ట్రైక్ తర్వాత మోదీ ఆర్మీ, నిఘా వారితో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ ఫోన్లను ఎందుకు వద్దన్నాడు అనేగా మీ అనుమానం. దానికి చాలా కథ ఉంది. మొత్తం చదివి తెలుసుకోండి.

కేంద్రమంత్రులకి ప్రధాని నరేంద్ర మోడీ చిన్న షాక్ ఇచ్చారు. ఇక నుంచి మంత్రివర్గ సమావేశాలకి ఎవరూ మొబైల్ ఫోన్స్ తో రాకూడదని ప్రధాని కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ జారీ అయ్యింది. సమావేశం జరుగుతున్నప్పుడు కొందరు మంత్రులు మొబైల్స్ లో మాట్లాడటం దానికి ఒక కారణం కాగా, మంత్రుల మొబైల్ ఫోన్లని చైనా, పాకిస్తాన్ హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు మరొక కారణమని తెలిసింది. సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత పాక్ హ్యాకర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన కొన్ని అధికారిక వెబ్ సైట్లని హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వారు మొబైల్ ఫోన్లలోకి కూడా వైరస్ జొప్పించి, వాటిని కూడా హ్యాక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తద్వారా మంత్రుల ఫోన్లని హ్యాక్ చేసి సమావేశం జరుగుతున్నప్పుడు వాటిలో ఆటోమేటిక్ రికార్డింగ్ మోడ్ ఆన్ అయ్యేలా చేసి సమావేశంలో చర్చించిన విషయాలన్నీ రికార్డింగ్ చేసి, ఆ సమాచారాన్ని హ్యాకర్ దొంగిలించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పి.ఎం.ఓ. ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల చేతనే మొబైల్స్ తీసుకుకు రావడాన్ని నిషేధించారు కనుక మంత్రులు కూడా అందుకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదు. మొత్తానికి నరేంద్ర మోదీ కేబినెట్ లో జరిగే ఏ ఒక్క అంతర్గత భద్రతాపరమైన అంశాన్నైనా బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
రాజీనామాలు అప్పుడే
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
సల్మాన్ ను వదలని కేసులు
జగన్ సభలో బాబు సినిమా
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి

Comments

comments