నరేంద్రమోదీ@50 రోజులు

Narendra Modi's fifty days time over

దేశం మొత్తం ఆ యాభై రోజులు ఎప్పుడు ముగుస్తాయా? అని తీక్షణంగా ఎదురుచూసింది. యాభై రోజుల తర్వాత వచ్చే నూతన ఉదయానికి అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. నాడు నవంబర్ 8వ తేదిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు యాభై రోజుల తర్వాత అద్భుతాలు జరుగుతాయని, ఎంతో మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. క్యులో గంటల కొద్ది వెయిట్ చేసి, బ్యాంకుల ముందు రోజుల పాటు తిరిగి తిరిగి అలిసిపోయినా కానీ కేవలం ఆ యాభై రోజుల తర్వాత భారతదేశం రూపురేఖలు మారతాయి అన్న ఒక్క గట్టినమ్మకం అందరిని నడిపించింది. అయితే నాడు మోదీ అడిగిన, చెప్పిన ఆ యాభై అపురూపమైన రోజులు ముగిసిపోయాయి.

50 రోజులు ఓపిక పట్టండి మీ తల రాతలు మారిపోతాయ్. నవంబర్‌ 8న రాత్రి నోట్ల రద్దు ప్రకటన చేస్తూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన సందేశమిది. పాత నోట్లను రద్దుచేసి యాభై రోజులు గడిచిపోయాయ్. కానీ మోడీ చెప్పినట్లు సామాన్యుల కష్టాలు మాత్రం తీరలేదు. యాభై రోజుల్లో ఏటీఎంలు తెరుచుకుంటాయని…కరెన్సీ కష్టాలు ఉండవని ప్రధాని చెప్పేశారు. దీంతో ఓపికపట్టారు జనం. మోదీ విధించిన యాభై రోజుల గడువు పూర్తైంది. కానీ ఇప్పటికైతే పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు.

వాస్తవ పరిస్థితులను చూస్తుంటే పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా లేవనిపిస్తోంది. 500 నోట్లు తగిన సంఖ్యలో ముద్రణ జరగలేదు. సరఫరా కూడా కాలేదు. కేవలం 2000 నోట్లు, వంద నోట్లు మాత్రమే ఏటీఎంలో కనపడుతున్నాయి అప్పుడప్పుడూ. రెండు వేల నోటుతో కష్టాలు తీరకపోగా అవి మరింత రెట్టింపయ్యాయి. మోదీ విధించిన గడువుతో తమ కష్టాలు నెరవేరతాయన్న ప్రజల ఆశలు అడిఆశలయ్యాయి. నోట్లు రద్దయితే నల్లధనం కోట్లు వచ్చిపడతాయి అనుకున్నారు. నల్ల కుబేరులు ఊచలు లెక్క పెడతారనుకున్నారు జనం. కాని నల్ల కుబేరులు బ్లాక్ ను వైట్ చేసేసుకున్నారు. ఇంట్లో నుంచి కాలు కదప కుండానే వారి సొమ్ములు భద్రంగా మళ్లీ ఇళ్లకు చేరాయి. కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ కట్టలు ఐటీ దాడుల్లో బయపపడుతున్నాయి. మరొకపక్క కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రెండు రోజుల్లో ప్రజలు శుభవార్త వింటారంటూ ఓ కామెంట్ చేశారు. ఆ శుభవార్తేమిటో వెంకయ్య చెప్పనేలేదు. కాగా మోదీ విధించిన గడువు ముగుస్తుండటంతో ప్రజలు తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Related posts:
ఇదో విడ్డూరం
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఓడినా విజేతనే.. భారత సింధూరం
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సల్మాన్ ను వదలని కేసులు
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
వంద, యాభై నోట్లు ఉంటాయా?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
జియో భారీ ఆఫర్ తెలుసా?
గాలిలో విమానం.. అందులో సిఎం
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఒక్క రూపాయికే చీర
ఏపికి యనమల షాకు

Comments

comments