ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!

Narsingh Yadav faced Policitical Game in sports

Narsingh Yadav faced Policitical Game in sports.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

నర్సింగ్ యాదవ్.. రెజ్లింగ్ లో భారత్ కు ఖచ్చితంగా పతకాన్ని తీసుకువస్తాడు అని చాలా మంది క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వినిపించింది. నర్సింగ్ యాదవ్ కు డోపింగ్ టెస్ట్ లు నిర్వహించగా.. అతడు  డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో అందరూ షాక్ తిన్నారు. భారత్ కు రెజ్లింగ్ లో నర్సింగ్ యాదవ్ మెడల్ తో వస్తారు అనుకుంటే ఏకంగా డోపింగ్ టెస్టుల్లో దొరికారు అంటూ వచ్చిన వార్త అందరిని నిరుత్సాహపరిచింది. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని.. తనకు ఏ పాపం తెలియదని.. తాను అమాయకున్ని అని నర్సింగ్ యాదవ్ అన్నా  కూడా ఎవరూ పట్టించుకోలేదు.

దాంతో దీనిపై లోతుగా విచారించిన నాడా నర్సింగ్ యాదవ్ ఎలాంటి డోపింగ్ కు పాల్పడలేదని.. డ్రగ్స్ తీసుకోలేదని తేల్చింది. పైగా నర్సింగ్ యాదవ్ పై అతడి సహచరులే కుట్ర చేశారని నాడా వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయినా రియో ఒలంపిక్స్ లో మన కీర్తి పతాకాలు ఎరగేస్తారు అనుకుంటే మనవాళ్లలో మనవాళ్లే రాజకీయాలు చేసుకోవడం దేశానికి సిగ్గుచేటు. క్రీడారంగంలో మనకున్న బలమే తక్కువ. మరి ఉన్న నలుగురిలో కూడా రాజకీయాలు, కుట్రలు జరిగితే పరిస్థితి ఏంటా అని అందరూ చర్చించుకుంటున్నారు.

రియో ఒలంపిక్స్ కోసం అని రాత్రి పగలు కష్టపడిన నర్సింగ్ యాదవ్ నిజంగా తాను నిర్దోషినే అన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఏదో మతలబు జరిగింది అని ఆయన అన్నా మాటలను వినిపించుకోలేదు. దాంతో నిద్రాహారాలు మాని కూర్చున్నాడు నర్సింగ్ యాదవ్. తన ఇన్నాళ్ల కష్టానికి విలువలేకుండా పోయిందని.. పైగా చెడ్డపేరు కూడా వచ్చిందని బాధపడ్డారు. నర్సింగ్ యాదవ్ పై ఉన్న కోపంతో కావాలనే డోపింగ్ కు పాల్పడ్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని నాడా వివరించింది. మరోసారి క్రీడా ప్రపంచంలో ఎన్నడూ ఇలాంటివి రిపీట్ కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
హరీష్.. ఇది నీకు సరికాదు
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ప్యాకేజీ కాదు క్యాబేజీ
2018లో తెలుగుదేశం ఖాళీ!
జియోకు పోటీగా ఆర్‌కాం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
జయ మరణం ముందే తెలుసా?

Comments

comments