మోదీకి సిద్దు బల్లే భలే షాక్

Modi-with-navjot-singh-sidd

Navjot Singh Sidhu gave shock to Modi by resign
This is for Telugoda: For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for you

వీలుదొరికినప్పుడల్లా ప్రధాని మోదీ మీద విమర్శలకు దిగడం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పెట్టింది పేరు. ఆయన తన టైంలో చాలా వరకు మోదీని విమర్శించడానికే కేటాయిస్తారు అనే అపవాదు ఉంది. దాని సంగతి పక్కన బెడితే కేజ్రీవాల్ మోదీకి భలేగా చెక్ చెప్పారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సిద్దూ షాకిచ్చాడు.  రాజ్యసభకు ఎన్నిక చేసిన ముచ్చట తీరని వేళ.. ఏకంగా పదవికి రాజీనామా చేయటం ద్వారా మోడీకి షాకిచ్చారని చెప్పాలి. ఎందుకిలా అంటే.. దాని వెనుక పెద్ద కథే ఉందని చెబుతున్నారు. సిద్ధూ వెనుక ఆమ్ఆద్మీ పార్టీ ఉండటమే తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు

సిద్ధూ వెనుక ఆమ్ఆద్మీ పార్టీ ఉండటమే తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు వీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా కసరత్తుచేస్తోంది. ఇందులో భాగంగా తమ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను బరిలోకి దించాలన్న నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.ఈ విషయాన్ని సిద్ధూకి అర్థమయ్యేలా చెప్పటంతో పాటు.. పంజాబ్ పార్టీ వ్యవహారాలు ఆయన చేతికి అప్పజెప్పాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం తనకు కట్టబెట్టిన రాజ్యసభ స్థానాన్ని వదులుకున్నట్లు చెబుతున్నారు. 2004 – 2009లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సిద్ధూ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోసం పోటీ చేయకుండా తప్పుకున్నారు.

ఇందుకుగాను ఇటీవల ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. అయితే.. పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలని తపిస్తున్న సిద్ధూకు.. ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు అండగా నిలుస్తానని చెప్పటం.. పంజాబ్ లో ఆ పార్టీకి మంచి పేరు ఉండటంతో.. బీజేపీకి షాకిచ్చేందుకు సిద్ధూ సిద్ధమయ్యారు. సిద్ధూ సతీమణి కౌర్ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కూడా తన పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. సిద్ధూతో మోడీకి దిమ్మ తిరిగే షాకు ఇవ్వటంలో కేజ్రీవాల్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. బలమైన అధికారపక్షాన్ని వదిలేసి బయటకు వెళ్లటం ఇప్పుడున్న రాజకీయాల్లో కాస్త చిత్రమే. అందులోకి మోడీలాంటి వ్యక్తికి చెందిన పార్టీకి చెందిన నేత అంటే.. ఇదేమీ చిన్న విషయం కాదనే చెప్పాలి.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
తాగుబోతుల తెలంగాణ!
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
గుజరాత్ సిఎం రాజీనామా
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
అడవిలో కలకలం
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
బిచ్చగాళ్లు కావలెను
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
జియో భారీ ఆఫర్ తెలుసా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
తిరిగిరాని లోకాలకు జయ

Comments

comments