నవాజ్.. ఆవాజ్ తగ్గించు

Nawaz Shariff on Kashmir at UN

దొంగనే దొంగా దొంగా అని అరిచిన చందంగా మారింది పాకిస్థాన్ పరిస్థితి. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ను వెనకేసుకువస్తూ కాశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తింది పాక్. కాశ్మీరీలకు స్వేచ్ఛను కోరుకుంటోంది అంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రకటనతో అందరూ విస్తుపోయారు. చిలకపలుకులు పలికిన నవాజ్ షరీఫ్ ను అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఓ పక్క యుద్ధానికి రెచ్చగొడుతూనే మరోపక్క శాంతి చర్చలకు తాము ఎంతో ముందుకు సాగాము అని యుఎన్ సాక్షిగా ప్రకటించింది పాకిస్థాన్.

తులసీవనంలో చేరినంత మాత్రాన గంజాయి మొక్క తులసిగా మారుతుందా ఏంటి.? ఐక్యరాజ్య సమితిలో శాంతి కోరుకుంటున్న దేశాలతో కలిసి పాటపాడినంత మాత్రాన పాకిస్థాన్ రక్తదాహం గురించి తెలియనిది ఎవరికి. అందుకే భారత్ దీనికి ధీటుగా సమాధానమిచ్చింది. బుర్షానీని అమరుడిగా కీర్తిస్తూ నవాజ్ షరీఫ్ చేసిన ప్రకటన మీద భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తీవ్రవాదిని అమర వీరుడిగా పాక్ కీర్తించడం అత్యంత హేయంగా భారత్ అభివర్ణించింది.

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ నాటకాలాడింది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఎంతో ఉదారంగా, శాంతి కోరుకుంటోంది అన్నట్లు ప్రకటన చేసింది. భారత్ వల్లే అసలు సమస్య ఏర్పడింది అన్న లెవల్ లో బిల్డప్ క్రియేట్ చేసింది. పాకిస్థాన్ ఓ ఉగ్ర‌వాద దేశ‌మ‌ని, అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న నిధులను ఆ దేశం ఉగ్ర‌వాదుల‌కు మ‌ళ్లిస్తోంద‌ని, దాంతో ఉగ్ర‌మూక‌లు పొరుగు దేశాల‌పై విరుచుకుప‌డుతున్నాయ‌ని భారత్ తీవ్రంగా ఆరోపించింది. జేషై చీఫ్ మ‌సూద్ అజ‌హ‌ర్‌, ముంబై పేలుళ్ల సూత్ర‌ధారి జ‌కీర్ ఉర్ రెహ్మాన్ ల‌ఖ్వి లాంటి ఉగ్ర‌నేత‌లు పాక్ వీధుల్లో స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌ని భార‌త్ వ్యాఖ్యానించింది. ప్ర‌భుత్వ ప్ర‌మేయంతోనే పాక్ అధికారులు త‌మకు వ‌స్తున్న నిధుల‌కు ఉగ్ర గ్రూపుల‌కు మ‌ళ్లింపు చేస్తోంద‌న్నారు. అయినా రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు.. కాల్పుల విరమణ కొనసాగిస్తాం అని చెప్పి మరీ.. దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు ఇలాంటి నాటకాలు కొత్తేమీ కాదు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
మంత్రుల ఫోన్లు బంద్
దిగజారుతున్న చంద్రబాబు పాలన
నారా వారి నరకాసుర పాలన
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
ఛాయ్‌వాలా@400కోట్లు
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments