నయీం రెండు కోరికలు తీరకుండానే…

Nayeem died with that two desires

క్రైమ్‌‌కింగ్, గ్యాంగ్‌స్టర్ నయీం ఇటీవల పోలీసుల ఎన్‌‌కౌంటర్‌లో హతమైన విషయం విధితమే. ఎంటివారినైనా బెదిరించి వారి అంతుచూసే నయీంకు రెండు చిరకాల కోరికలు అలాగే మిగిలిపోయాయి. నయీం ఎన్‌కౌంటర్ అనంతరం ఆయనుకున్న ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు డైరీని సంపాదించిన విషయం తెలిసిందే. డైరీ ఓపెన్ చేస్తే చాలు అతని నిజ జీవితానికి సంబంధించిన విషయాలు, తన జీవితంలో చేసిన పనులన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. కాగా ఒక్కొక్కటిగా నయీం ఆగడాలు వెలుగు చూస్తున్నాయి.

ఆయన నివాసముంటున్న భువనగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యేందుకు పక్కా ప్లాన్ వేసి.. అందుకు ఎన్ని అడ్డంకులు అధిగమించేందుకు, కోట్లు కుమ్మరించి ఓట్లు కొనేందుకు అంతా సంసిద్దం చేశాడు.. ఇంతలోనే పోలీసుల కాల్పుల్లో పిట్ల రాలినట్లు రాలిపోయాడు. దీంతో ఆ ఎమ్మెల్యే కోరిక కాస్త కల్లలైపోయింది. కాగా తాజాగా నయీంకు సంబంధించిన మరో విషయం వెలుగు చూసింది. అటు రాజకీయ నేతగా.. ఇటు సినీ ఇండస్ట్రీలో పెత్తనం చలాయించాలని ప్లాన్ చేశారట.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి తన మార్క్‌ను చూపడానికి టాలీవుడ్‌లో ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని భావించాడట. ఆ సినిమా ఏదో కాదు నయీం జీవిత చరిత్రమీదేనట. ఈ చిత్రం తరువాత రీల్ లైఫ్‌‌లో రాజకీయ నాయకుడిగా పెట్టి అనంతరం దాన్ని రియల్ లైఫ్‌‌లో మలుచుకోవాలని భావించినట్లుగా అతని అనుచరులు చెబుతున్నారు. సినిమా తీసేందుకు గాను పలువురు డైరక్టర్లు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారని తెలిసింది. అంతా అనుకున్నట్లు జరిగివుంటే మరో వారం రోజుల్లో సినిమా ప్రారంభించడానికి సంసిద్ధమయ్యాం.. ఇంతలోనే నయీం హతమయ్యాడని అతని గ్యాంగ్‌లో పనిచేసిన కొందరు పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
2018లో తెలుగుదేశం ఖాళీ!
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
తెలంగాణ 3300 కోట్లు పాయె
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
అమ్మ పరిస్థితి ఏంటి?
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
మంత్రి గంటా ఆస్తుల జప్తు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments