గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్

Nayeem encounter in Telangana

ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ నేరగాడు.. గ్యాంగ్ స్టర్ – సుపారీ కిల్లర్ గ్యాంగ్ అధినేత – మాజీ మావోయిస్టు.. ఒకటా రెండా ఎన్నో విశేషణాలున్న కరడుగట్టిన నేరగాడు నయీం హతమయ్యాడు. పోలీసుల కాల్పుల్లో ఈ ఉదయం ఎన్ కౌంటర్ అయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు అతణ్ని కాల్చిచంపారు.మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ శివారులో నయూమ్ ఉన్న ఇంటిని ఈ ఉదయం గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టగా నయీం గన్ మెన్ తొలుత కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి నయీంను తుదముట్టించారు.

నయీమ్ ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో పౌరహక్కుల నేత పురుషోత్తం హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. బెల్లి లలిత హత్య కేసు తరువాత నయూమ్ అంటే అందరిలో భయం పెరిగిపోయింది. అనంతరం మావోయిస్ట్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన నయీమ్ సొంతంగా గ్యాంగ్ ను స్థాపించి అనేక హత్యలకు పాల్పడ్డాడు. సెటిల్మెంట్లు – దందాలు – హత్యలతో బెదరగొట్టాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఇతర గ్యాంగ్ స్టర్లను కూడా నయీం ముఠా చంపేసింది. పోలీసులకు ఇన్ఫార్మర్ గానూ పనిచేయడంతో నయీంకు చాలాకాలం అడ్డు లేకుండా పోయింది. అధికారం – అధికారులు మారిన తరువాత నయీం ముఠా ఆగడాలకు చాలావరకు కళ్లెం పడింది. పోలీసుల సహకారం కొరవడడంతో నయీంకు కష్టాలు మొదలై ఇప్పుడు ఎన్ కౌంటర్ అయ్యాడు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
సైన్యం చేతికి టర్కీ
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
బతుకు బస్టాండ్ అంటే ఇదే
వంద, యాభై నోట్లు ఉంటాయా?
మోదీ ప్రాణానికి ముప్పు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి

Comments

comments