నయీం బాధితుల ‘క్యూ’

Nayeem Victims que to Buvangiri Revenue Office

తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నయీం ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం చేతుల్లో మోసపోయిన, అతడి జులుంకు భయపడిన వారు ఒక్కొక్కరుగా తమ గోడును వెల్లగక్కుతున్నారు. గ‌తంలో నయీం అక్రమంగా చేసుకున్న ప‌లు ప్లాట్ల రిజిస్ట్రేష‌న్లపై ఈరోజు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా భువనగిరిలోని ఆర్డీవో కార్యాల‌యంలో విచార‌ణ జ‌రుపుతున్నారు. బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1500 మందికి చెందిన ప్లాట్లను న‌యీమ్ లాక్కున్న అంశంపై వారు విచారణ కొన‌సాగిస్తున్నారు.

త‌మ భూములు నయీం అక్ర‌మంగా లాక్కున్నాడ‌ని సుమారు 1500 మంది బాధితులు ఆర్డీవో ఆఫీసుకి చేరుకున్నారు.  భువనగిరి ఆర్డీవో కార్యాలయానికి గ్యాంగ్‌స్టర్‌ నయీం బాధితులు క్యూ కడుతున్నారు. భువనగిరి మండలం బొమ్మాయిపల్లి శివారులోని సర్వే నెంబర్‌ 722 నుండి 733 వరకు ఉన్న 170 ఎకరాల భూమిని నయీం కబ్జా చేశాడని బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వారి ప్లాట్ల‌కు సంబంధించిన ప‌లు పత్రాల‌ను మీడియాకు కూడా చూపించారు. త‌మ‌ను నయీం అనుచ‌రులు భ‌య‌పెట్టార‌ని వారు మీడియాతో అన్నారు. త‌మ ప్లాట్ల‌ను త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా వేడుకున్నారు. నయీం ఆగడాలు అన్నీ ఇన్నీ కావని, నయీం అనుచరులను విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
గుజరాత్ సిఎం రాజీనామా
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
‘స్టే’ కావాలి..?
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ఏపీ బంద్.. హోదా కోసం
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
గెలిచి ఓడిన రోహిత్ వేముల
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
దిగజారుతున్న చంద్రబాబు పాలన
బతుకు బస్టాండ్ అంటే ఇదే
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
అకౌంట్లో పదివేలు వస్తాయా?
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments