రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి… కేసీఆర్ సర్కార్‌కు సూచన

Who need reservations

కేసీఆర్ మ‌రోసారి తేనెతుట్టును క‌దిపారా.. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తుంది. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలో ముందుండే కేసీఆర్, రిజ‌ర్వేష‌న్లు వ్య‌వ‌హారంలో కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌నుకుంటున్నారా? కానీ అది కొన్ని వ‌ర్గాల‌కు సంతృప్తినిచ్చినా.. మిగిలిన వ‌ర్గాలను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇప్ప‌టికే రాజ్యాంగం క‌ల్పించిన కోటాలు దాటుతున్నాయి. మైనార్టీల‌కు హామీ ఇచ్చారు. గిరిజ‌నుల‌కు పెంచుతామ‌న్నారు. ఇప్పుడు బీసీల‌కు కూడా దామాషా ప‌ద్ద‌తిలో క‌ట్ట‌బ‌డి ఉన్నామంటున్నారు.

కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అట్ట‌డుగు వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌నుకోవ‌డంలో త‌ప్పు లేదు. వారిని ఉద్ద‌రించ‌డ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్యం. కానీ అగ్ర‌వ‌ర్ణాల్లో పేద‌ల‌కు మాత్రం ఎందుకు భ‌రోసా ఇవ్వ‌డం లేదు. వారిని ఆదుకోవాల్సిన అవ‌స‌రం లేదా? ఇప్ప‌టికీ అగ్ర‌వ‌ర్ణాల్లో పేద‌లు కుల సంఘాల‌ను న‌మ్ముకుని వ‌స‌తి పొందుతున్నారు. రుణాలు, రిజ‌ర్వేష‌న్లు అంద‌క తెలివితేట‌లు ఉన్నా.. గ్రామాల‌కే ప‌రిమితం అవుతున్నారు. మ‌రి అలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్య‌త కూడా కేసీఆర్ తీసుకోవాలి. ఏ సంక్షేమం అయినా.. రిజ‌ర్వేష‌న్లు అయినా పేద‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టానికే.. మ‌రి అగ్ర‌వ‌ర్ణ పేద‌ల కోసం కూడా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఓటుబ్యాంకు లేదు క‌దా అని అగ్ర‌వ‌ర్ణాల‌ను చిన్న‌చూపు చూడ‌డం అన్ని రాష్ట్రాల్లో నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింది. కానీ కేసీఆర్ అలా చేయ‌ర‌ని భావిస్తున్నామని పేద అగ్రవర్ణాలంటున్నాయి.

పేద‌లు ప్రాతిప‌దిక‌గా ప‌థ‌కాలు రూపొందించాలని సూచిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్లు ఇవ్వండి.. రాజ్యాంగం స‌వ‌రించుకోండి.. కానీ పేరుకే అగ్ర‌వ‌ర్ణాలుగా ఉండి కడు పేద‌రికం అనుభవిస్తున్న వారిని కూడా ప‌ట్టించుకోండని వేడుకుంటున్నారు. వారి శ్రేయ‌స్సును గుర్తించమని కోరుతున్నారు. అలా కాకుండా వదిలేసి కోటాలు పెంచుకుంటూ పోతే..  మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, రాజ‌స్తాన్, గుజ‌రాత్‌ త‌ర‌హాలోనే ఇక్క‌డ ఉద్య‌మాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అయితే కేసీఆర్ అవ‌కాశం ఇవ్వ‌ర‌నే భావిస్తున్నారు. సంక్షేమంలో, ఇతర కార్యక్రమాల్లో సంచలనాలకు తెరతీసే కేసీఆర్ దేశానికి ఆదర్శంగా ఉంటున్నారు.  ఇప్పుడు కూడా రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల సంగతి కాసేపు పక్కన పెట్టి పేదల ప్రయోజనాలు లక్ష్యంగా సరికొత్త విధానం తీసుకొస్తే అది అందరికి ఉపయోగపడుతుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతుంది.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
జీఎస్టీ బిల్ కథ..
అడకత్తెరలో కేసీఆర్
పవన్ ను కదిలించిన వినోద్
టాప్ గేర్ లో ముద్రగడ
అన్నదమ్ముల సవాల్
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
ఎవరు చాణిక్యులు..?
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
చెత్త టీంతో చంద్రబాబు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే

Comments

comments