నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!

Nenu ala anukunnanu Kaani inta badyata raahityamaa!

భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం పెద్దనోట్ల రద్దును చాలా మంది వ్యతిరేకించగా, కొంత మంది సమర్థించారు. ప్రకటన చేసినప్పుడు చాలా మంది సమర్థించినా ఇప్పుడు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కాగా లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ మాత్రం ముందు నుండి మోదీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. అయితే తను కేవలం మోదీ నిర్ణయం వరకు మాత్రమే సమర్థిస్తున్నానని, అంతేకానీ ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులకు కాదు అని అన్నారు. చిన్న మొత్తంలో డబ్బులు కావాలన్నా కూడా గంటల కొద్దీ బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాల్సి వస్తోందని అంటున్నారు.

పెద్ద మొత్తంలో నల్లధనాన్ని కూడగట్టిన బడాబాబులను మాత్రం తాను వ్యతిరేకిస్తున్నానని, అలాంటి వారి ఆట కట్టించడానికి మోదీ తీసుకున్న అతి కీలక స్టెప్ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు జయప్రకాశ్ నారాయణ. అయితే ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఊహించిన దానికి భిన్నంగా మారాయని అన్నారు. పెద్దనోట్లను రద్దు చెయ్యడం ద్వారా జనాల దగ్గర ఉన్న డబ్బును బలవంతంగా లాక్కున్న ప్రభుత్వం అదే డబ్బులను కొత్త కరెన్సీలో చెల్లించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అయితే అలా చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాంటప్పుడు జనాలు ఎలా బ్రతుకగలుగుతారు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జనాల దగ్గరి నుండి బలవంతంగా డబ్బులు లాక్కుని, అతి కొద్దిమొత్తంలో మాత్రమే తిరిగి చెల్లిస్తుండటం దురదృష్టం అని ఆయన అన్నారు. అయితే మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాల్సింది అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. దేశ ప్రయోజనాలపై దూరదృష్టిలేకపోవడం, నిర్లక్ష్యం కొట్టొచ్చునట్లు కనిపిస్తున్నాయని జెపి అన్నారు. ప్రభుత్వం ప్రజలను క్యూలైన్లలో నిల్చోమని, గంటల కొద్దైనా వేచి ఉండాలని అడగటం ఏంటని అభిప్రాయపడ్డారు. అన్నింటికి మించి మోదీ ఈ పరిణామంపై మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడేస్తుందో వివరించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఆయనకు వంద మంది భార్యలు
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
బావర్చి హోటల్ సీజ్
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
జియోకే షాకిచ్చే ఆఫర్లు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
సదావర్తి సత్రం షాకిచ్చింది
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
తిరిగబడితే తారుమారే
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
అకౌంట్లో పదివేలు వస్తాయా?
ఆయన మాట్లాడితే భూకంపం
వాళ్లకు ఇదే చివరి అవకాశం
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments