500 నోటుపై ఫోటో మార్చాలంట

Netizens demandinig New photo on five hundred rupees note

నవంబర్ 8వ తేది నుండి కౌంట్ డౌన్ మొదలైంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు రాలేదు. పైనుండి రకరకాల ప్రకటనలు మాత్రం పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. వాచ్ లో టైం మారుతోంది.. క్యాలెండర్ లో తేది మారుతోంది.. కొద్దిరోజులుపోతే క్యాలెండరే మారుతుంది. అయినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు జనాల పడిగాపులు మాత్రం ఎంతకీ తగ్గడంలేదు. ఆర్బీఐ, కేంద్రం ప్రజలకు మేం మరిన్ని సేవలు అందిస్తున్నాం.. కొద్దిరోజుల్లో పరిస్థితి మారబోతోంది అని ప్రకటనలు చేసినా.. అది కేవలం మాటల వరకు మాత్రమే కనిపిస్తోంది.

చలిలో కూడా జనాలు రాత్రుళ్లు ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యులో నానాకష్టాలుపడుతున్నారు. ఇలా… టైం, రోజుతో నిమిత్తంలేకుండా దేశ ప్రజలు బ్యాంకులు ఎటిఎంల చుట్టూ క్యూకడుతున్నారు. నెలా పదిహేను రోజులు కావొస్తున్నా ఈ దృశ్యంలో ఏ మార్పూ కనిపించడంలేదు. ఈ కష్టాలే ఇప్పుడు దేశప్రజల్ని అసహనానికి గురిచేస్తున్నాయి. ప్రజలు తాము పడుతున్న కష్టాలపై వివిధరూపాల్లో గళమెత్తుతున్నారు. పలు క్యూలైన్లలో చెలరేగిన అలజడులు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అయితే, సోషల్ మీడియాలోనూ నెటిజన్లు వివిధరూపాల్లో కేంద్రానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు వైరల్ గా మరింది ఈ పిక్. పాత, కొత్త 500 కరెన్సీ నోటులోని తేడాల్ని గమనించండంటూ బ్యాంకు క్యూలైన్లను నోటులో క్రియేట్ చేసి వదిలిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

new note

కొత్త ఐదు వందల నోటు కన్నా కూడా పాత ఐదువందలనోటు వెనక ఉన్న గాంధీ ఉప్పుసత్యాగ్రహం నాటి ఫోటో అందరికి తెలిసిందే. మహాత్మా గాంధీ ముందు నడుస్తుంటే వెనక కొంత మంది పాలో అవుతుంటారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోకు బదులుగా ఏటీఎం ముందు క్యులో పడిగాపులుకాసే ఫోటోను పెట్టాలని నెటిజన్లు ఓ పోస్ట్ తో తెగహడావిడి చేస్తున్నారు.

Related posts:
ఇదో విడ్డూరం
అతడి అంగమే ప్రాణం కాపాడింది
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
ఆట ఆడలేమా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
నయీం రెండు కోరికలు తీరకుండానే...
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
రాజీనామాలు అప్పుడే
కాశ్మీర్ భారత్‌లో భాగమే
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
నారా వారి అతి తెలివి
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
అతి పెద్ద కుంభకోణం ఇదే
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments