ఇష్టానుసారంగా జిల్లాలు… బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు

New Districts in Telangana by KCR desire

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తలుచుకుంటే కొత్త జిల్లాలకు తక్కువా. పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పి తెలంగాణలోని జిల్లాలను కొత్తగా విభజిస్తే, తక్కువ విస్తీర్ణంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ముందు 26 జిల్లాలు అన్నారు. కానీ తర్వాత 29 అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 31 జిల్లాలు అంటున్నారు. కాదు 33 జిల్లాలు అయితే బాగుటుంది అని అంటున్నారు. అన్ని జిల్లాలు ఎలాగూ ఇచ్చారు కదా మొత్తం 38 జిల్లాలు ఏర్పాటు చెయ్యండి అని మరోమాట వినిపిస్తోంది. కేసీఆర్ చేపట్టిన జిల్లాల పునర్విభజన రోజుకో ట్విస్ట్ తో అందరికి షాకిస్తోంది.

గతంలో ప్రతిపాదించిన 27 జిల్లాలతో పాటు అదనంగా గద్వాల, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జనగామల జిల్లాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల సంఖ్య 31కి చేరింది.  అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా వస్తున్న డిమాండ్ల ఆధారంగా వెల్లడవుతుంది. నగర శివారులోని ఇబ్రహీంపట్నం, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ జిల్లాల ఏర్పాటు చేయాలని హైపవర్‌ కమిటీ దృష్టికి వచ్చాయి. తన దగ్గరకు వచ్చిన వినతులను కూడా సీఎం కేసీఆర్‌ కె.కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీని పంపినట్టు తెలిసింది. 31 జిల్లాలకే పరిమితం కాకుండా 38 జిల్లాల వరకు ఉద్యోగుల సర్దుబాటు చూడాలని ఉన్నత స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు సూచించినట్టు సమాచారం.

ముసాయిదా నోటిఫికేషన్‌లో లేని జిల్లాలను ప్రకటించడంతో తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ ములుగు, భద్రాద్రి, మిర్యాలగూడ, నారాయణపేట జిల్లా ప్రజలు కోరుతున్నారు. ములుగు, భద్రాద్రిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ జిల్లా కోసం ఉద్యమించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. నారాయణపేటను జిల్లా చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా ములుగు, భద్రాచలం జిల్లా కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో కొత్త జిల్లాల వ్యవహారం తెలంగాణ సర్కార్ కు మించిన భారంగా మారుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి అభీష్టానుసారంగా సాగుతున్న జిల్లాల ప్రక్రియ వింతగా జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే పేరున్న ప్రాంతాలను కేసీఆర్ జిల్లాలుగా చేసేశారు. ఇక తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని బ్రతిమాలితే వారి వినతిని మన్నించి కేసీఆర్ కొత్త జిల్లాగా వారి ప్రాంతాన్ని ప్రకటించారు. అదే విధంగా తమ ప్రాంతానికి జిల్లా హోదా కల్పించాలని డిమాండ్ ను కాస్త గట్టిగా బెదిరింపు ధోరణిలో చెబితే కూడా కేసీఆర్ వింటున్నారు. ఇక అప్పటికీ కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకురానిపక్షంలో రాజీనామా అస్త్రాన్ని సంధిస్తే చాలు కొత్త జిల్లా ప్రకటన ఏర్పాటు జరిగిపోతుంది.

అయినా కొత్త జిల్లాల ఏర్పాటు కేసీఆర్ ఏ ప్రాతిపదికన చేస్తున్నారు అన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం అన్న మాట తప్ప కొత్తగా ఏ మాటా వినిపించడం లేదు. విస్తీర్ణం, జనాభా, వనరులు, సరిహద్దులు లాంటి వాటిని పరిగణలోకి తీసుకుని జిల్లాల పునర్విభన చేశారా..? అంటే కనీసం అధికారుల నుండి కూడా సమాధానం రావడం లేదు. పోనీ మొత్తంగా పరిపాలనా సౌలభ్యం కోసమే చేశారనుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ను మాత్రం ఎందుకు వదిలేశారు అన్న ప్రశ్నకు కూడా సమాధానమివ్వాల్సి వస్తుంది. మరి అయ్యవారి మనసుకు తోచిన చందంగా చేస్తున్న కేసీఆర్ ఎంత వరకు కొత్త జిల్లాల ఏర్పాటును సక్సెస్ చేస్తారో..అభివృద్ధికి బాటలు వేస్తారో చూడాలి.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
ఉక్కిరిబిక్కిరి
పవన్ మాస్టర్ స్కెచ్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
పట్టిసీమ వరమా..? వృధానా..?
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
మద్యల నీ గోలేంది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments