షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

new twist in Sheena bora case

షీనా బోరా పేరు గుర్తుందా… దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బడా ఫ్యామిలీ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొన్నటి వరకు షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీ చుట్టూ తిరిగిన కేసు తాజాగా ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీకి మారింది. షీనా బోరా సోదరుడు మైకేల్‌ బోరాపై హత్యాయత్నం చేశారని ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాపై ప్రత్యేక సీబీఐ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. షీనా కనిపించకుండా పోవడంపై మైకేల్‌ ఎన్నో ప్రశ్నలు అడుగుతుండడంతో ఇంద్రాణి అతడిని కూడా చంపాలని అనుకుందని తెలిపింది సీబీఐ.

ఈ కేసులో ఇంద్రాణి కారు డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ నాలుగో నిందితుడు. షీనాను హత్యచేయడానికి సహకరించాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అతడు అప్రూవర్‌గా మారాడు. 2012 ఏప్రిల్‌లో ముంబై శివారు ప్రాంతంలో ఇంద్రాణి తన మాజీ భర్తతో కలిసి కారులో షీనాను గొంతు నులిమి చంపేశారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ముంబయి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సగం కాలిపోయిన స్థితిలో షీనా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి షీనా బోరా మర్డర్ లో డైరెక్ట్ గా లేకున్నా కానీ పీటర్ ముఖర్జీ పేరు హత్యాయత్నం కేసులో బయటకు వచ్చింది.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
సల్మాన్ ఖాన్ నిర్దోషి
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఆటలా..? యుద్ధమా..?
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
జియోకే షాకిచ్చే ఆఫర్లు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
అడవిలో కలకలం
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
అమెరికా ఏమంటోంది?
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
వంద, యాభై నోట్లు ఉంటాయా?
అతి పెద్ద కుంభకోణం ఇదే
అవినీతి ఆరోపణల్లో రిజిజు
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
అందుకే భూకంపం రాలేదట
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు

Comments

comments