ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే

New two thousand notes direct to Shekar Reddy house from printing press

దేశం మొత్తం నగదులేక అల్లాడుతుంటే.. కొంత మంది బడాబాబుల దగ్గర మాత్రం కట్టలుకట్టులుగా డబ్బులు, బంగారం బయటపడటం సంచలనం రేపుతోంది. మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి దగ్గర భారీగా నగదును సొంతం చేసుకున్న ఐటీ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. అంత డబ్బును శేఖర్ రెడ్డి ఎలా దాచుకున్నారో వాళ్లలో వాళ్లే చర్చించుకున్నారంటే.. అక్కడి పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 131కోట్ల నగదు, 170 కేజీల బంగారం బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడైన శేఖర్ రెడ్డికి 2000 కొత్త నోట్లు బ్యాంకుల నుంచి కాకుండా ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా అందినట్లు సమాచారం. ఈ విషయం అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దాంతో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులు శేఖర్‌రెడ్డి వద్ద లభ్యమైన 2వేల నోట్ల సీరియల్‌ నెంబర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. ఆ ప్రకారం నోట్లు ముద్రించే ప్రెస్నుంచే శేఖర్‌రెడ్డికి పెద్దమొత్తంలో కొత్త నోట్లు చేరినట్లుగా భావిస్తున్నారు.

సాధారణంగా కొత్తనోట్లు నోట్లు ముద్రించే ప్రెస్ నుంచి రిజర్వ్‌బ్యాంకుకి, అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్తాయి. కానీ స్టేట్‌ బ్యాంకుకు చెందిన కొన్ని పాలన కార్యాలయాలకు నేరుగానే కొత్త నోట్లు వచ్చాయి. ఇలా వచ్చిన కొత్త 2వేల నోట్లే శేఖర్‌రెడ్డి ఇంటికి వచ్చినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్టేట్‌ బ్యాంకుకు చెందిన పది మంది ఉన్నతాధికారులను విచారిస్తున్న ఐటీ అధికారులు, త్వరలోనే వారినీ అరెస్టు చేయనున్నట్లు సమాచారం. కాగా, సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన నోట్లను రిజర్వ్ బ్యాంకుకు అక్కడి నుంచి ఇతర బ్యాంకులకు నోట్లు పంపిణీ జరగాలి. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఏపీ, తెలంగాణలోని ఎస్‌బీఐ ప్రత్యేక శాఖ(స్కేప్)లకు పంపారు. స్కేప్‌గా పిలిచే ఈ శాఖలు ఏపీలో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇలాంటి శాఖలకు వచ్చిన కొత్త కరెన్సీని యథాతథంగా శేఖర్ రెడ్డికి బదలాయించడం సంచలనంగా మారింది. ఐటీ అధికారుల విచారణ పూర్తయితే గానీ ఏ శాఖల నుంచి శేఖర్ రెడ్డి ఇంటికి నగదు వెళ్లిందనే విషయం వెలుగులోకి వస్తుంది.

Related posts:
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
‘స్టే’ కావాలి..?
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ఏపీ బంద్.. హోదా కోసం
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments