పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్

NewPapers Classifieds as Dont come for Marriage

జీవితంలో ఎంతో మదురానుభవాల్లో పెళ్లి కూడా ఒక్కటి. అలాంటి పెళ్లికి అందరిని పిలిచి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేపుకోలనే ఎవరైనా అనుకుంటారు. కానీ తాజాగా ఓ జంట మాత్రం బాబోయ్ .. మా పెళ్లికి రావద్దు అంటూ ఏకంగా న్యూస్ పేపర్ లో యాడ్ వేశారు. అవును మామూలుగా అయితే అందరిని ఆహ్వానించలేని వాళ్లు ఇలా పత్రికల్లో తమ పెళ్లి లేదా కార్యానికి రమ్మని యాడ్ వేస్తారు. కానీ వీళ్లేంటి ఏకంగా రావద్దు అని యాడ్ వేశారు అని అనుకుంటున్నారా. అయితే ఎందుకు అలా యాడ్ వెయ్యాల్సి వచ్చిందో స్టోరీ చదివి తెలుసుకోవాల్సిందే.

తాజాగా కశ్మీర్ లోని పేపర్లలో తమ పెళ్లికి రావద్దు అనే వింత ప్రకటన కనిపించింది. దానికి కారణం అక్కడి పరిస్థితులు. రంజాన్‌ మాసంలోనే చాలా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బంధువులకు, స్నేహితులకు శుభలేఖలు కూడా పంపించారు. అయితే అనుకోకుండా  కశ్మీర్ లో అల్లర్లు చెలరేగడంతో తమ పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని న్యూస్ పేపర్స్ లోని క్లాసిఫైడ్‌ యాడ్స్‌ ద్వారా బంధువులకు తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని పేపర్లలోనూ ఇలాంటి ప్రకటనలే కనబడుతున్నాయి. ‘మా వివాహం రద్దయింది. ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇందుకు చింతిస్తున్నా’మంటూ క్లాసిఫైడ్‌ రూపంలో ప్రకటనలు ఇచ్చారు. మొత్తానికి ఇంత బ్యాడ్ లోనే గుడ్ ఏంటంటే.. న్యూస్ పేపర్లు యాడ్స్ కు మాత్రం ఫుల్ గిరాకీ ఉండటం.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
సన్మానం చేయించుకున్న వెంకయ్య
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
రాజీనామాలు అప్పుడే
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
మావో నాయకుడు ఆర్కే క్షేమం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
బాకీలను రద్దు చేసిన SBI
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై

Comments

comments