పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?

No body knows Pawan Kalyan's strategy

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మార్పులు వార్తల్లో మెయిన్ న్యూస్ గా మారుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల అభివృద్ది, ఆటంకాల మీద పుంఖానుపుంఖాలు వార్తలు గుప్పించిన మీడియా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన మీద ఎలా వార్తలు రాయాలో అర్థంకావడం లేదు. అదేంటి వార్తలు రాయలేనంత డైలమా ఎందుకు అని అనుకుంటున్నారా..? పలానా అంశం మీద పవన్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని అనుకుంటే అది ఆయన మాట్లాడతారో లేదో? క్లారిటీ లేదు. పార్టీని స్థాపించిన తర్వాత చాలా కాలానికి జనసేన అధినేత ప్రజల్లోకి వచ్చాడు.

తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి.. ప్రతిజిల్లాలో సభ పెట్టి ప్రత్యేక హోదా మీద అవగాహన కల్పిస్తానని పవన్ వెల్లడించారు. కానీ తర్వాత కాకినాడ సభలో మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా.. ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోకుండా ఆత్మగౌరవం పేరుతో ఏదేదో మాట్లాడారు. చివరకు పవన్ ఏం మాట్లాడారు అని చూస్తే మాత్రం శూన్యమే కనిపించింది. ఇక కాకినాడ సభ తర్వాత బహిరంగ సభలు నిర్వహించడం లేదు అని వెల్లడించారు. మొత్తానికి పవన్ ఓ సారి సభలు నిర్వహిస్తాను అని అంటారు. కానీ సభ తర్వాత మాత్రం సభలు నిర్వహించను అని అంటారు. ఇలా రెండు రకాల వార్తలు రాయడంతో అందరికి క్లారిటీ మిస్ అయింది.

ఇక కాకినాడ సభ తర్వాత పవన్ కళ్యాణ్ సభలు నిర్వహిస్తాడా..? లేదా..? అన్న దానిపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన అజెండాగా చేసుకొని సభ సాగుతుంది అని జనసేన పార్టీ అధికార ప్రకటన చేసింది. అయినా కాకినాడ సభ సమయం లొ పవన్ కళ్యాణ్ గారు ( తల్లి తండ్రులకు చెతులెత్తి నమస్కరిస్తున్న మీ పిల్లలని బహిరంగ సభలకు పంపద్దు ) అని సెలవిచ్చారు , ఇప్పుడు నవంబర్ 10 న అనంతపురంలొ బహిరంగ సభ పెడుతున్నారు. మరి ఈ సభలకు ఎవరు రావాలి..? మామూలు జనాలు అనుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ కు తిక్క ఉంది అని తెలిసినా.. దానికి లెక్కేది అనే ప్రశ్న తలెత్తింది. అయినా పవన్ కళ్యాణ్  స్ట్రాటజీ ఏంటో ఎవరికి అర్థంకావడం లేదు అన్నది వాస్తవం.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ఆయనకు వంద మంది భార్యలు
తాగుబోతుల తెలంగాణ!
బావర్చి హోటల్ సీజ్
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
నయీం రెండు కోరికలు తీరకుండానే...
‘స్టే’ కావాలి..?
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
నారా వారి అతి తెలివి
ఆ సిఎంను చూడు బాబు...
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments