బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ

No Buller and no blood but india almost won Pakistan

ఉరీ ఘటన తర్వాత భారత్ తన వైఖరిని మార్చుకుంది. దేశంలో చాలా వరకు పాకిస్థాన్ మీద యుద్ధం చెయ్యాలని వాదనలు వినిపించినా కానీ చివరకు భారత్ మాత్రం పాకిస్థాన్ ను చుక్కరక్తం రాకుండా.. కనీసం ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా సైలెంట్ గా కట్టడి చేస్తోంది. ముందు నుండి రక్తానికి రక్తం అనే పాలసీ మన రక్తంలో లేకపోవడంతో మోదీ సర్కార్ వేస్తున్న ఈ ప్లాన్ అద్భుతంగా మారింది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తూ ఇప్పటికే భారత్ ఓ అడుగు ముందుకేసింది. లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరి నుండి మోదీ వరకు వాజ్ పేయ్ తో సహా అందరిని పాకిస్థాన్ నిలువునా మోసం చేసింది.

అందుకే గుంటనక్క పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీస్తోంది భారత్. అందులో భాగంగా పాకిస్థాన్ చుట్టు నెమ్మదిగా తాడు బిగిస్తోంది. పాకిస్తాన్ కు బిజినెస్ పరంగా గతంలో ఇచ్చిన అత్యంత అనుకూల దేశం హోదాను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్ననే సింధూ నది జలాల ఒప్పందంపై సమీక్షించిన ప్రధాని… మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాపైనా రివ్యూకి సిద్ధమయ్యారు. ఈ నెల 29న విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖ అధికారులతో… ప్రధాని సమావేశం కానున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సాధారణ ఒప్పందాల ప్రకారం 1996లో పాకిస్తాన్ కు అత్యంత అనుకూల దేశం హోదా ఇచ్చారు. యూరీ దాడి తర్వాత దానిని విత్ డ్రా చేయాలనే డిమాండ్ తీవ్రమైంది. దీంతో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా పై రివ్యూకు రెడీ అయ్యారు మోడీ.

నిజానికి పాకిస్తాన్ కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా అక్కర్లేదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. దీనికి రాజకీయంతో పాటు వాణిజ్య అంశాలను కూడా కారణంగా చూపుతున్నారు. 2015-16 లో ప్రపంచదేశాలతో 641 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది ఇండియా. ఇందులో పాకిస్తాన్ వాటా 2.67 బిలియన్ డాలర్లే. అంటే మొత్తం వాణిజ్యంలో ఇది 0.83 శాతం మాత్రమే. ఇంత తక్కువ వాణిజ్యం జరుగుతున్నప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా అవసరంలేదన్నారు నిపుణులు. మొదట్నుంచి పాక్ ను భారత్ అనుకూల దేశంగానే గౌరవించిందని… ఆ గౌరవాన్ని పాక్ నిలుపుకులేకపోయిందంటున్నారు.

మరోపక్క సార్క సమావేశాలకు కూడా భారత్ ఝలక్ ఇచ్చింది. కాగా భారత్ బాటలోనే మరికొన్ని దేశాలు కూడా నడవడంతో పాకిస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  న‌వంబ‌ర్‌లో ఇస్లామాబాద్‌లో జ‌రిగే సార్క్ దేశాల స‌మావేశానికి హాజ‌రు కాకూడ‌ద‌ని భార‌త్ స‌హా మ‌రో మూడు దేశాలు నిర్ణ‌యించాయి. బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ కూడా సార్క్ స‌మావేశాల్లో పాల్గొన‌బోమ‌ని స్ప‌ష్టంచేశాయి. ఇస్లామాబాద్‌లో స‌మావేశాల‌కు ఇప్పుడున్న వాతావ‌ర‌ణం అనుకూలంగా లేద‌ని ఆ దేశాలు తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్థాన్ ను భారత్ ఏకాకిని చెయ్యడంలో దాదాపుగా మంచి ఫలితాలను అందుకుంటోంది అని భావించవచ్చు. మొత్తంగా పాకిస్థాన్ కు మాత్రం మన వాళ్లు చుక్కలు చూపిస్తున్న మాట మాత్రం వాస్తవం.కాగా తాజా సార్క్ సభ్యదేశాలు సమావేశానికి గైర్హాజరవుతున్నందున పాకిస్థాన్ లో నిర్వహించతలచిన సమావేశం రద్దు అయింది. పాకిస్థాన్ ను ఏకాకి చెయ్యాలన్న ఇండియా ప్లాన్  దాదాపుగా సఫలమయినట్లు సార్క్ సమావేశాల రద్దుతో తెలిసిపోయింది.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
పవన్ ను కదిలించిన వినోద్
ఉక్కిరిబిక్కిరి
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మద్యల నీ గోలేంది..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments