రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం

No development in Ap for Amaravati

ఏపిలో అభివృద్ధి అనేది కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతోందని అర్థమవుతోంది. లెక్కల ప్రకారం చూస్తే అసలు ఏపిలో ఏం జరుగుతుందో క్లీయర్ గా అర్థమవుతోంది. దేశదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు తప్పు అని ప్రభుత్వమే తేల్చేసింది. అవును అభివృద్ధి సూక్ష్మాన్ని బ్రహ్మాండంగా చూపించే ప్రయత్నం చేస్తున్న మీడియాకు, ప్రభుత్వానికి లెక్కలు ఖంగుతినిపించాయి. పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, సేవారంగం అభివృద్ధి, తలసరి ఆదాయం మీద ప్రభుత్వం తీసిన లెక్కలు చంద్రబాబు నాయుడు పని తీరును అద్దం పడుతోంది.

విభజన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేదు.. కాబట్టి వెంటనే రాజధానిని నిర్మించాలని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి మిగిలిన ప్రాంతాలకు శాపంగా మారింది. అమరావతి మీద చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి విఘాతంగా మారింది. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక ప్రగతిపై ప్రభుత్వం తీసిన లెక్కలు వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. తలసరి ఆదాయంలో ఏపి సగటు మంచి ప్రగతిని సాధించింది అన్న చంద్రబాబు ప్రకటన ఓ బూటకం అని తేలిపోయింది.

వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల్లో నియోజక వర్గాల వారిగా ఉత్పత్తి విలువ ఆధారంగా అన్ని నియోజక వర్గాలకు ర్యాంకులిచ్చారు. అందులో 175 నియోజక వర్గాల్లో చివరి జిల్లాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో లెక్కలు చూస్తే అర్థమవుతుంది. గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజక వర్గాలు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పూర్తిగా వెనకబడ్డాయి. ఏపిలో ఈ రంగంలో వెనకబడ్డ జిల్లాలుగా ఈ రెండింటికి చివరి ర్యాంకులు వచ్చాయి. కృష్ణా జిల్లా కైకలూరులో వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తి విలువ 3471 కోట్లు ఉండగా, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజక వర్గాలలో ఇదే ఉత్పత్తి విలువ దాదాపుగా శూన్యంగా ఉండటం అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టింది.

వ్యవసాయ, అనుబంధ రంగంలో వెనకబడ్డ ఐదు నియోజక వర్గాలు..
నియోక వర్గం                   ఉత్పత్తి విలువ కోట్లలో     ర్యాంకు

గుంటూరు(పశ్చిమ)                     0                         175
గుంటూరు(తూర్పు)                    0                         174
నెల్లూరు సిటీ                            5                         173
విశాఖపట్నం(ఉత్తరం)                 6                         172
కర్నూలు                                 9                         171

అలాగే పారిశ్రామిక ప్రగతిలోనూ ఆంధ్రప్రదేశ్ చాలా నియోజక వర్గాలు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి తాను పెట్టుబడులు తీసుకు వచ్చి పరిశ్రమలను తీసుకువస్తానని అంటున్నా కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిశ్రమల స్థాపన జరగడం లేదు. ఏపిలో ముందు నుండి అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పారిశ్రామిక రంగ ప్రగతిలో ఈ రెండు జిల్లాలకు చెందిన అరకు, పాడేరు, ఇచ్చాపురం వెనకబడ్డాయి. అరకు నియోజ వర్గంలో పారిశ్రామిక ఉత్పత్తి విలువ 50 కోట్లు ఉండగా. గాజువాకలో 7359 కోట్లు ఉంది. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. విశాఖ జిల్లాకు చెందిన అరకు, పాడేరు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, పోలవరంలు పారిశ్రామిక ప్రగతిలో రాష్ట్రంలోనే అధమంలో ఉన్నాయి.

పారిశ్రామిక రంగ ప్రగతిలో వెనకబడ్డ ఐదు నియోజక వర్గాలు..
నియోక వర్గం                   ఉత్పత్తి విలువ కోట్లలో     ర్యాంకు
అరకు(విశాఖ)                               50                   175
పాడేరు(విశాఖ)                             52                   174
ఇచ్చాపురం(శ్రీకాకుళం)                   112                   173
చింతలపూడి(ప.గోదావరి)                124                   172
పోలవరం(ప.గోదావరి)                   128                   171

ఇక ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు సేవా రంగాన్ని అభివృద్ధి రెక్కలు తొడిగాడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే సేవారంగంలో విఫలమవుతున్నారు. సేవారంగంలో నియోజక వర్గాల ర్యాంకులు, వాటి ఉత్పత్తి విలువను చూస్తే అసలు మ్యాటర్ ఏంటో అర్థమవుతోంది. కొన్ని రోజుల క్రితం అధికారపక్షానికి షాకిచ్చిన పెడన నియోజక వర్గం సేవారంగంలో అన్నింటికన్నా వెనకబడింది. సేవారంగంలో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 4923 కోట్లు ఉత్పత్తి చెయ్యగా, కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో సేవారంగంలో దాదాపుగా అటకెక్కింది. కర్నూలు జిల్లా కొడుమూరు, మంత్రాలయం, చిత్తరు జిల్లాగంగాధర నెల్లూరు, అనంతపురం జిల్లా మడకశిరలు కూడా ఉత్తత్తి విలువ కనీసం ఆరు వందల కోట్లు కూడా దాటడం లేదు.

సేవారంగంలో వెనకబడ్డ నియోజక వర్గాలు..
నియోక వర్గం                ఉత్పత్తి విలువ కోట్లలో     ర్యాంకు
పెడన(కృష్ణా)                          510               175
కోడుమూరు(కర్నూలు)               539               174
మంత్రాలయం                        547               173
గంగాధర నెల్లూరు(చిత్తూరు)        591               172
మడకశిర(అనంతపురం)             591               171

ఇక అన్నింటికంటే ఏపిలో అభివృద్ధికి కొలమానంగా భావించే తలసరి ఆదాయం కొన్ని నియోజక వర్గాల్లో మరీ దారుణంగా ఉంది. కురుపాం, పిఠాపురం, మడకశిర, పార్వతీపురం, ఇచ్చాపురంలో ఏపిలోని అన్ని నియోజక వర్గాల కన్నా తక్కువగా నమోదైంది. ఏపిలో అభివృద్ధి ఉరకలేస్తోంది అని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం కర పత్రాలు, ఫ్లెక్సీల వరకు మాత్రమే పరిమితమైందని తేలిపోయింది.కురుపాంలో తలసరి ఆదాయం 57, 225 రూపాయలు, పిఠాపురం తలసరి ఆదాయం 53, 931 రూపాయలు, మడకశిరలో తలసరి ఆదాయం 53, 038 రూపాయలు, పార్వతీపురం 51, 038 రూపాయలు, ఇచ్చాపురం 46, 905 రూపాయల కనిష్ట తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది. దీన్ని బట్టే ప్రభుత్వం పాలన ఎంత చక్కగా సాగిస్తోందో తెలిసిపోతోంది.

నియోజకవర్గం    తలసరి ఆదాయం(రూపాయలలో)
కురుపాంలో        57, 225
పిఠాపురం           53, 931
మడకశిరగ         53, 038
పార్వతీపురం      51, 038
ఇచ్చాపురం        46, 905

ఏపిలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించాల్సిన చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తున్న నిర్వాకానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి తాజా గణాంకాలు. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కన్నా మేం ముందున్నాం అని చెప్పుకుంటున్న ఏపి నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. అమరావతి పేరుతో చేస్తున్న నిర్లక్ష్యం మిగిలిన ప్రాంతాలకు అభివృద్ధిని దూరం చేస్తోంది. అమరావతినైనా వేగంగా పూర్తి చేస్తున్నారా..? అంటే అది కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు ఏపిలో చేస్తున్న అభివృద్ధి ఏంటో కనీసం ఆయనకైనా తెలిస్తే బాగుంటుంది కదా.

నియోక వర్గం ఉత్పత్తి విలువ కోట్లలో ర్యాంకు
Related posts:
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
ఇదే జగ‘నిజం’
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఆ అరుపులేంటి..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ఎవరు చాణిక్యులు..?
మూడింటికి తేడా ఏంటి..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మెరుపు దాడి... నిజమా-కాదా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments