పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి

No power in Janasena President Pawan Kalyan

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయంగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్నాడు. గత ఎన్నికలకు ముందు జనసేన అంటూ ఓ రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోయినా.. తెలుగుదేశం, బిజెపిలకు తన సపోర్ట్ అందించాడు. ఇప్పుడు తాజాగా మరోసారి జనాల గురించి మాట్లాడారు. గతకొంత కాలంగా తీవ్రంగా నలుగుతున్న ఆక్వాఫుడ్ పరిశ్రమపై ఆయన రైతులకు చర్చించారు. రైతులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ తో చెప్పుకున్నారు.

ఏపిలోని పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వాఫుడ్ పరిశ్రమ నిబంధనలు పాటించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. లాభాలే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు తాను సమస్యను వివరిస్తానని అన్నారు. సమస్యలు పోలీసులతో పరిష్కారం కావు సరికదా మరింత జటిలమవుతాయని ఆయన సూచించారు. అలా కాదని పోలీసులతోనే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే ప్రజాస్వామ్యంలో అంతకంటే పెద్ద తప్పు మరోటి ఉండదని ఆయన పేర్కొన్నారు. ఆక్వాఫుడ్ బాధితులకు జనసేన తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెగా ఆక్వాఫుడ్ పరిశ్రమను సముద్రతీరానికి తరలించాలన్నారు.

కనీసం కమిటీ వేసి, ప్రజా సమస్యలు వినడం ద్వారా సమస్యను ఓ కొలిక్కి తీసుకురావచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే తాము కోర్టు కెళ్లి సమస్యపై కమిటీ వేసేలా చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పరిశ్రమకు లైసెన్స్‌ ఇచ్చినప్పుడే ప్రభుత్వాలు జాగ్రత్తపడాలని పవన్‌ సూచించారు. గ్రామాలకు దగ్గరగా పరిశ్రమలు నిర్మించడం వల్ల ఎక్కువ దుష్పరిణామాలు వాటిల్లుతాయని చెప్పారు.

గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆక్వాఫుడ్ ఇండస్ట్రీతో పాటు తమ పార్టీకి చెందిన అంశాలను, ప్రత్యేక హోదా అంశం మీద కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమం ముగిసిపోలేదని ఆయన తెలిపారు. తాము పార్టీ క్యాంపు ఆఫీస్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పార్టీ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. మొత్తానికి చాలా కాలం తర్వాత పవన్ తాను తిరిగి జనాల్లోకి వస్తాను అనే సంకేతాలు ఇచ్చాడు. అయితే పవన్ అప్రోచ్ మీద మాత్రం విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. గతంలో అమరావతి భూముల అంశంలోనూ, ఇప్పటి ఆక్వాఫుడ్ బాధితుల విషయంలోనూ పవన్ తన మార్క్ పవర్ ను చూపించలేకపోతున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
అతడికి గూగుల్ అంటే కోపం
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
జగన్ సభలో బాబు సినిమా
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
తిరిగబడితే తారుమారే
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఛాయ్‌వాలా@400కోట్లు
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

Comments

comments