వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే

Now its time for allo instead of whatsapp

ప్రపంచం ఇప్పుడు కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. అన్ని విశేషాలు చేతివేళ్ల దగ్గరికి చేరుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మరీ స్పీడ్ అయిపోయింది. మనకు కావాల్సిన వాళ్లను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అలాంటి సోషల్ మీడియా మెసెజింగ్ యాప్ లలో వాట్సాప్ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. కానీ అదే వాట్సాప్ కు మించిన ఫీచర్లతో గూగుల్ అలో దూసుకొచ్చేసింది. గూగుల్ నుండి వచ్చిన ఈ యాప్ వెంట ఇప్పుడు యువత పిచ్చ క్రేజ్ తో పరుగెడుతోంది. వాట్స్ యాప్ కు పోటీగానే దీన్ని విడుదల చేస్తున్నామని గూగుల్ లో అసలు కొత్తగా ఏం ఉన్నాయో తెలుసా..?

గూగుల్ అసిస్టెంట్: ఈ యాప్ లో గూగుల్ సెర్చ్ అసిస్టెంట్ లభిస్తుంది. అంటే ఏదైనా సెర్చ్ చేయాలంటే, యాప్ ను మూసేసి, గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే సెర్చ్ చేయవచ్చు. అక్కడ లభించే వీడియోలు, చిత్రాలు, లింక్ లను పంచుకోవచ్చు.

స్మార్ట్ రిప్లై: దీనిలో స్మార్ట్ రిప్లై ఫీచర్ అత్యంత ఆకర్షణీయం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఈ ఫీచర్ యూజర్ల మెయిల్ వ్యూయింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. సమాచారాన్ని చదివి, మీరు అటువంటి సమాచారం చదివినప్పుడు గతంలో వినియోగించిన ‘హహహ’, ‘లోల్’ వంటి పదాలను సమాధానంగా పంపుతుంది.

ఇన్‌కాగ్నిటో మోడ్: ఎంత నెట్ వాడకందారులైనా, సోషల్ మీడియా పిచ్చోళ్లయినా, ఏదో ఒక దశలో ప్రైవసీ కోరుకుంటారు. కాసేపు సెల్ పక్కన పెడతారు. అటువంటి సమయాల్లో ఉపయోగపడేలా, ఇన్విజబుల్, లాక్ స్క్రీన్ తదితర సదుపాయాలను కల్పిస్తూ, ఇన్ కాగ్నిటో మోడ్ ను అల్లో వెంట తెచ్చింది.

ఇమేజ్ రికగ్నైజేషన్: గూగుల్ గతంలో విడుదల చేసిన విప్లవాత్మక ఫోటోల గుర్తింపు ఫీచర్ అల్లోకు మరో ఆకర్షణ. మన స్నేహితులు, బంధువుల చిత్రాలను ఇది గుర్తిస్తుంది. ఓ కుక్కకు, మనిషికి ఉండే తేడానూ గుర్తు పడుతుంది. మీకు దగ్గరి స్నేహితుల ఫోటోలు వస్తే అలర్ట్ చేస్తుంది కూడా.

జీ మెయిల్ అకౌంట్ సింక్: యూజర్ల జీ మెయిల్ కు వస్తున్న ఈ-మెయిల్ వివరాలను ఈ యాప్ నోటిఫికేషన్స్ రూపంలో చూపిస్తుంటుంది. ఆ మెయిల్స్ వివరాలను ఇక్కడే తెలుసుకుంటూ ఉండవచ్చు.

ఆటో డిలీట్: పాత మెసేజ్ లను డిలీట్ చేసేలా ఆటో డిలీట్ సదుపాయం ఉంది. ఒక గంటనో, ఒక రోజనో టైం ముందుగానే సెట్ చేసి పెడితే, ఆ సమయానికి ఉన్న అన్ని పాతమెసేజ్ లనూ యాప్ తుడిచేస్తుంది. దీని వల్ల ఫోన్ లోని మెమోరీ ఆదా అవుతుంది. మీరు చదవగానే డిలీట్ అయిపోవాలన్న ఆప్షన్ కూడా ఉంది.

ఫాంట్ సైజ్ పెంచుకునే అవకాశం: యాప్ లో సమాచారం మరీ చిన్న అక్షరాల్లో ఉందని భావిస్తే, అక్షరాల సైజ్ ను పెంచుకోవచ్చు. ఇలా వాట్స్ యాప్ అందించని సౌకర్యాలను అల్లో దగ్గర చేయడంతోనే ఈ యాప్ కు డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి.

అందుకే ఇప్పుడు  యూత్ వాట్సాప్ కు బదులు అల్లో అంటున్నారు. మరి గూగుల్ నుండి వచ్చిన అల్లో పోటీని వాట్పాప్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ఆయనకు వంద మంది భార్యలు
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
నయీం బాధితుల ‘క్యూ’
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
జగన్ సభలో బాబు సినిమా
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
మోదీ ఒక్కడే తెలివైనోడా?
గాలిలో విమానం.. అందులో సిఎం

Comments

comments