ఎన్టీఆర్ కొత్త పార్టీ!

NTR may starts new party aganist to ChandrababuNaidu

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికారం కోసం అక్కడి పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు అంటే అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు జరగబోయే పరిణామాలను బాగా గుర్తించగలిగే చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించారు.

తాజాగా పవన్ కు వ్యతిరేకంగా జగన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటి ఎన్టీఆర్ ను వైయస్ జగన్ దించడం ఏంటి అనుకుంటున్నారా..? అవును జగన్ పార్టీలో ఉన్న ఎన్టీఆర్ సన్నిహితుడు, స్నేహితుడు కొడాలి నాని ద్వారా ఈ ప్లాన్ ను అమలు చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి చేరారు. వైసీపీలో చేరినా కానీ హరికృష్ణతో ముఖ్యంగా ఎన్టీఆర్ తో మాత్రం కాంటాక్ట్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే కొత్త రాజకీయానికి దారితీస్తోందని అనుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం ఖరారైంది. ఇప్పటికే ఆయన రాయలసీమ మీద దృష్టిసారించారు. హైదరాబాద్ తర్వాత తన రెండో పార్టీ కార్యాలయాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైయస్ జగన్ ను రాయలసీమలో పూర్తి స్థాయి ఆధిక్యం ఉంది. దాంతో పవన్ రాయలసీమ మీద దృష్టిసారించి జగన్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం కోసం ఇలా చేస్తున్నారు అని అనిపిస్తోంది. ఎన్నికల్లో పవన్ పూర్తి స్థాయి మెజార్టీ ఎలాగూ రాదు.. అలాంటి టైంలో పవన్ చంద్రబాబుకు అండగా నిలుస్తారు. మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ కు అండగా నిలిచేది లేదంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేసేది ఎవరు?

చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పని చేసేది ఎవరు? అనే ప్రశ్నకు సమాధానమే ఎన్టీఆర్. అవును కొడాలి నాని చేత ఓ పార్టీని స్థాపించి, దానికి మొత్తం ఎన్టీఆరే అని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో తగిన ప్రధాన్యత లేని క్రమంలో ఇలాంటి పరిణామాలకు కూడా అవకాశాలున్నాయి. అయితే ఎన్టీఆర్ గుంటూరు, కృష్ణా జిల్లాలో తన సత్తాచూపించడం ద్వారా ఏపిలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అలా ఎన్టీఆర్ ఓ కొత్త పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పని చేస్తే, అది ఖచ్చితంగా వైయస్ జగన్ కు కలిసివచ్చే అంశం. అయితే ఏపిలో ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని రాజకీయ సర్కిల్స్ లో ఫుల్ చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో? !

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఏపి సిఎంగా నారా లోకేష్
ఓటుకు నోటు కేసును మూసేశారా?

Comments

comments