టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!

NTR Political Punch in Janatha Garrage

సినిమాలకు, రాజకీయాలకు చాలా అనుబంధం ఉంది. చాలా వరకు సినిమాల్లో ఉన్న స్టార్లు మన తెలుగు నాట రాజకీయ నాయకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సినిమాలకు, రాజకీయాలకు లంకె వేస్తే ముందుకు గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు (సీనియర్). ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హవా సాగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పేరుతో పార్టీని స్థాపించి.. దాన్ని అధికారంలోకి తీసుకువచ్చాడు. ఆ మహానుభావుడి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకు వచ్చి.. దుమ్మురేపుతున్నాడు. రాజకీయంగా కూడా ఎన్టీఆర్ ఓ సారి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కాగా తాజాగా విడుదలైన ఎన్టీఆర్, కొరటాల శివల జనతాగ్యారేజ్ టీజర్ రాజకీయ ప్రకంపనలకు తావిస్తోంది.

ఎన్టీఆర్ చెప్పిన డైలాగుపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ స్టెమినా ఏంటో తెలిసిన.. చాలా మంది ఇది ఎన్టీఆర్ వేస్తున్న స్కెచ్ లో భాగంగానే జరుగుతోందని జోష్యం చెబుతున్నారు.అప్పట్లో ఎన్నికల ప్రచారానికి ముందు ఓ సినిమాలో కూడా ఇలాంటి డైలాగే చెప్పారు. ‘‘ఈ సైకిల్ పై వచ్చి చరిత్ర సృష్టించిన వాళ్లున్నారు.. అయినా నేను రాననుకున్నారా.. రాలేననుకున్నారా..’’ అంటూ చెప్పిన డైలాగ్ చాలా మందికి గుర్తుండి ఉంటుంది. తాజాగా జనతాగ్యారేజ్ లో కూడా అలాంటి డైలాగ్ తో రెచ్చిపోయారు. ఇది కూడా పొలిటికల్ గేమ్ లో భాగమని చాలా మంది భావిస్తున్నారు.

తాజాగా విడుదలైన జనతాగ్యారేజ్ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రికార్డుల సంగతి పక్కనబెడితే.. ఎన్టీఆర్ రాజకీయ ఉద్దేశంతోనే ‘‘బలహీనుడి వెంట కూడా ఓ బలం ఉంది’’ అన్న డైలాగ్ ను వాడినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. మరి దీని మీద ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.ఎన్టీఆర్ కావాలనే ఆ డైలాగ్ వాడారని.. అది ఎవరి తగలాగో కరెక్ట్ గా తగిలింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో లెజెండ్ సినిమాలో కూడా బాలకృష్ణ ఇలాంటి డైలాగ్ నే వాడారు. నేను దిగనంత వరకే.. వన్స్ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్’’ అనే డైలాగు, ‘‘చెప్పు.. పడుకున్న సింహాన్ని తట్టిలేపినట్టు వాడికి చెప్పు’’ లాంటి డైలాగులు పొలిటికల్ గా ట్రెండ్ సెట్ చేశాయి. మరి ఈసారి ఎన్టీఆర్ డైలాగ్ ఎలాంటి ఫలితాలను చూపిస్తుందో చూడాలి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
అహా... అందుకేనా..?!
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఓటుకు నోటు కేసును మూసేశారా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments