పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!

Nuclear bomb fight between India and Pakistan

కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. కశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు. అంతకు ముందు భారత హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటనను సయీద్ తీవ్రంగా వ్యతిరేకించారు.

కాశ్మీర్ విషయంలో ప్రపంచం, పాకిస్థాన్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముక్తి ప్రసాదించకపోతే అణచివేతకు గురవుతున్న కశ్మీర్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేస్తారని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం విస్మరించినా, పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోయినా, భారత్ వేధింపులు ఆపకపోయినా.. ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదని సలాహుదీన్ హెచ్చరించారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
ఆటలా..? యుద్ధమా..?
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
బాబు బండారం బయటపడింది
సౌదీలో యువరాజుకు ఉరి
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments