కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు

on Kashmir Issue Jawaharlal Nehru decision on that time right but wrong for ever

భారత ఖండంలో భాగంగా ఉన్న కాశ్మీర్ ను అటు పాకిస్థాన్ లో కానీ ఇటు ఇండియాలో కానీ కలిపేందుకు కాశ్మీర్ రాజు నిర్ణయించుకోవాల్సిన టైం వచ్చింది. కానీ కాశ్మీర్ రాజు హరిసింగ్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాశ్మీర్ ను పాకిస్థాన్ లో కలుపుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ కాశ్మీర్ దిశగా కదిలింది. దాంతో హరిసింగ్ భారత హోంమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను కలిశాడు. ఆయన నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిశారు. కాగా నెహ్రూతో కలిసి హరిసింగ్ ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు.

తన కాశ్మీర్ రాజ్యాన్ని భారత్ లో విలీనం చేస్తున్నట్లు రాత పూర్వకంగా సంతకాలు చేశాడు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు దీనికి సంబందించిన పత్రాలను కూడా సమర్పించాడు. ఆనాడు పత్రికలో వచ్చిన ప్రకటనను మీరు కింద చూడవచ్చు.

Kashmir-Conflict-03
అక్టోబర్ 28, 1947 పత్రికలో వచ్చిన వార్త

భారత్ లో కాశ్మీర్ రాజ్యాన్ని విలీనం చెయ్యడంతో వెంటనే ఇండియా తరఫున భారీగా బలగాలు కాశ్మీర్ లోకి ప్రవేశించి.. పాకిస్థాన్ సేనలకు చుక్కలు చూపించాయి. అప్పటికి దాదాపుగా శ్రీనగర్ దాకా వచ్చిన పాక్ సేనలను మన సేనలు తరిమితరిమి కొట్టాయి. దాదాపుగా భారత్ భూభాగం నుండి తమిరికొట్టాయి. కాగా కొన్ని కీలక ప్రదేశాల్లో మాత్రం అలా జరగలేదు. దాంతో పాక్ సేనలు కాశ్మీర్ రాజ్యం నుండి పూర్తిగా కాకుండా పాక్షికంగా వైదొగాయి.

ముందు నుండి యుద్దం అంటే ఇష్టం లేని నెహ్రూ భారత సైన్యానికి అనుకొని ఆదేశాలిచ్చాడు. ఆనాడు ఆర్మీ అధికారులు లాహోర్ వరకు తమ జైత్రయాత్రను కొనసాగిద్దామని అనుకున్నా వెంటనే భారత సైన్యాన్ని వెనక్కి తగ్గమని ఆదేశించారు. అయితే నెహ్రూ తీసుకున్న నిర్ణయం మీద చాలా మంది వ్యతిరేకించారు. ఆయన తన నిర్ణయాన్ని కేబినెట్ మీటింగ్ లో చర్చించి తీసుకోకుండా .. కేవలం వ్యక్తిగతంగా తీసుకున్నారు. అప్పటికే ఐక్యరాజ్యసమితికి చేరిన కాశ్మీర్ వ్యవహారంపై రెండు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాలని ఆదేశించింది.

ఐక్యరాజ్యసమితి ఆదేశంతో భారత సైన్యం వెనక్కి తగ్గింది. కాల్పుల విరమణను పాటించింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఐక్యరాజ్యసమితి ఆదేశాన్ని పట్టించుకోకుండా సైన్యాన్ని యుద్దం కోసం ఉంచుకుంది. అలా కొన్ని కీలక భాగాలు పాకిస్థాన్ సైన్యం చేతిలొ ఉండిపోయాయి. దాంతో చేసేదేమీ లేక యుద్దం కన్నా సంది మిన్న అని నిర్ణయించుకున్న నెహ్రూ ఉద్రిక్తత తగ్గే వరకు కాశ్మీర్ లో యధాతథ పరిస్థితి కొనసాగుతుంది అని నిర్ణయం ప్రకటించారు. కానీ ఆ యధాతథ పరిస్థితి ఇప్పటికింకా చిలికి చిలికి గాలి వానగా మారినట్లు.. అంతకంతకు ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కాశ్మీర్ వీధుల్లో రక్తం ఏరులై పారుతోంది. తూటాలు వీధుల్లొ కనిపిస్తూనే ఉంటాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ : పాకిస్థాన్ భారత్ నుండి అక్రమంగా లాక్కున్న కాశ్మీర్ భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఇప్పటికీ పిలుస్తారు.  భారత్ తన భూభాగాన్ని వదులుకుందే కానీ ఎన్నడూ ఏ దేశం భూభాగాన్ని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నించలేదు.

నెహ్రూ నిర్ణయం తర్వాత కాశ్మీర్ లో ఎలాంటి పరిణామాలు చోటచుచేసుకున్నాయమో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ నాలుగోభాగాన్ని చదవండి.

  • అభినవచారి

Also Read:

కాశ్మీర్ గొడవకు కారణం ఇతడే (రెండో భాగం)

కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది (మొదటి భాగం)

 

 

Related posts:
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
ఇదే జగ‘నిజం’
పవన్ ను కదిలించిన వినోద్
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ప్రత్యేక హోదా లాభాలు
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పిట్టల దొరను మించిన మాటల దొర
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?

Comments

comments