రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?

One Acer for One Rupee

అవును.. రూపాయికే కిలో బియ్యం అన్నట్లు రూపాయికే ఎకరా భూమి ఇస్తే ఎవరైనా ఊరుకుంటారా..? ఏపిలో తాజాగా వచ్చిన ఓ వార్త దీనికి మూలం. ఏపిలో ప్రస్తుతం పెట్టుబడుల కోసం అక్కడి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. రండి. రండి.. పెట్టుబడులతో రండి… మీకు ఏం కావాలో చెప్పండి చాలు అన్నీ మేం చూసుకుంటాం అని ప్రభుత్వం రెడ్ కార్పేట్ వేస్తోంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఓ బడా కంపెనీ యజమాని, కార్పోరేట్ రంగంలో బడేమియ్యా లాంటి వ్యక్తి రెండు వేల ఎకరాలను తన ఫ్యాక్టరీకి అడిగాడు. దాంట్లో ఏంటయ్యా తప్పు అనుకుంటున్నారేమో.. ఆయన అడిగిన రేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రభుత్వం రూపాయికి ఎకరం భూమిని ఇస్తే రెండు వేల ఎకరాల్లో కంపెనీని స్థాపించడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ఆ కంపెనీ ప్రభుత్వానికి లేఖరాసిందట. దాన్ని చదివిన సిఎస్ కూడా షాక్ కు గురయ్యాడట. అయినా రూపాయికే ఎకరా భూమి ఏంటి అనుకొని.. మరొక్కసారి తిరిగి చదివాడట. అప్పుడు కూడా రెండు వేల ఎకరాలకు రెండు వేల రూపాయలు అని ఉందట. దాంతో ఖంగుతిన్న సిఎస్ కు ఏం చెయ్యాలో కూడా పాలుపోలేదట. పోనీ.. అది ఏదో మామూలు కంపెనీ నుండి వచ్చింది అనుకుంటే కాదు.. బడా కంపెనీ.

ఇంతకీ ఆ కంపెనీ ఏంటో చెప్పలేదు కదూ.. భారత్ లో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ గా మారిన ముఖేశ్ అంబానీ. అవును రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మెన్ ముఖేశ్ అంబానీనే. రెండు వేల ఎకరాల భూమిని 2వేల రూపాయలకు తమ కంపెనీకి కేటాయిస్తే తాము సబ్ మెరైన్ల తయారీ కంపెనీని పెట్టనున్నట్లుగా రిలయన్స్ తన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదన చూసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ అండ్ కో షాక్ తిన్న పరిస్థితి. విశాఖ జిల్లాలోని నక్కపల్లి దగ్గర 2వేల ఎకరాల్ని సింఫుల్ గా రెండు వేల రూపాయిలకే అడిగిన రిలయన్స్  ఆఫర్ ను ఏపీ సర్కారు నో అని చెప్పేసిందట. అయితే ఇది నిజంగా వచ్చిన వార్తనేనా..? లేదంటే లేఖలో ఏమైనా తప్పుల వల్ల అలా వచ్చిందా ..? అన్నదానిపై క్లారిటీ లేదు.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
సల్మాన్ ను వదలని కేసులు
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
జియోకు పోటీగా ఆర్‌కాం
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
చెబితే 50.. దొరికితే 90
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
బంగారం బట్టబయలు చేస్తారా?
ఛాయ్‌వాలా@400కోట్లు
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?

Comments

comments