లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో

Jagan counter

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షన్నర కోట్ల అవినీతి. దేశంలోనే అవినీతికి కేరాఫ్..ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపిలో అవినీతికి అడ్డుఅదుపులేకుండాపోయింది అన్నది వాస్తవం. దేశంలో నెంబర్ రాష్ట్రంగా నిలబెడతానని ముందు నుండి చెప్పుకొచ్చిన చంద్రబాబు అవినీతి ర్యాంకింగ్ లో మాత్రం ఏపిని నెంబర్ వన్ గా నిలబెట్టారు. అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారిన చంద్రబాబు నాయుడు సర్కార్ పై వైయస్ జగన్ లేఖాస్త్రాన్ని సంధించారు.

ఏపిలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించిన వైయస్ జగన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అధికారాన్ని చేపట్టి రెండున్నరేళ్లు గడిస్తే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఏకంగా లక్షన్నర కోట్ల అవినీతి చోటుచేసుకుందని, దానిపై గతంలోనే ఫిర్యాదు చేశామని, వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టాలని జగన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వివరించారు.  ఇప్పటికే ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు అవినీతిపై ఒంటికాలు మీద లేచిన జగన్ ఈసారి మోదీకి లేఖ రాసి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరి తమ మిత్రపక్షం కావడంతో మోదీ చంద్రబాబు నాయుడు అంశాన్ని పక్కనపెట్టేస్తారో.. లేదంటే అవినీతి ఆరోపణల మీద చంద్రబాబు పనిపడతాడో చూడాలి.

Related posts:
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
గెలిచి ఓడిన రోహిత్ వేముల
బాబు బండారం బయటపడింది
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
ఆ సిఎంను చూడు బాబు...
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
కేసీఆర్ మార్క్ ఏంటో?

Comments

comments