ఒక దేశం… ఒక్కటే పన్ను అదే జీఎస్టీ

One nation one tax that is GST

దేశవ్యాప్తంగా జిఎస్టీపై పార్లమెంట్ సాక్షిగా చర్చ సాగింది. ఎంతో కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లదీసిన జీఎస్టీకి మోక్షం కలిగింది. నిన్న రాజ్యసభలో(ఆగష్టు3) జీఎస్టీకి అన్ని పక్షాలు అనుకూలంగా ఓటు వేశాయి. అసలు జీఎస్టీ అంటే ఏమిటి దానిలో ఉన్నా ఛాలెంజ్ లు ఏంటి.? ప్రజలకు కలిగే లాభాలేందటి..? వ్యాపారులకు కలిగే లాభం ఏంటి..? జీఎస్టీ రేట్ ఎంత..? జీఎస్టీ రావడం వల్ల ఏఏ పన్నులు రద్దయ్యాయి…? ఏఏ వస్తువులకు, సేవలకు జీఎస్టీ మినహాయింపు లభిస్తుంది అన్న అంశాలను కింద వివరిస్తున్నాం.

జీఎస్టీ అంటే:
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(వస్తు, సేవల పన్ను)

ప్రభుత్వానికి ఏంటి లాభం?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. అయిదారు రకాల పన్నులకు బదలు ఒకటే జీఎస్‌టీ వసూలు చేయవచ్చు. తద్వారా పన్నుల ఎగవేతను చాలావరకూ అరికట్టవచ్చు. పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు, వ్యాపారస్థులు కూడా ఎగవేతకు సిద్ధపడకపోవచ్చు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. అంతేగాక పన్నుల వసూళ్లకు ప్రభుత్వం వెచ్చించే వ్యయాలు తగ్గుతాయి. ప్రభుత్వ ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుంది.

ప్రజలకు లాభం ఏంటి..?
రకరకాల ట్యాక్సులు కట్టకుండా కేవలం ఒకేటా ట్యాక్స్ ను చెల్లించేందుకు అవకాశం కల్పించింది రకరకాల పన్నుల స్థానంలో ఒకటే ట్యాక్స్ తో పాటుగా కస్టమర్ ఎంత పన్ను చెల్లిస్తున్నాడో కూడా ఈజీగా తెలుస్తుంది.

వ్యాపార సంస్థలకు లాభం ఏంటి..?
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌, పన్ను చెల్లింపు, రీఫండ్‌ చాలా సులువు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే పరోక్ష పన్ను రేటు అమలు అయ్యేందుకు జీఎస్‌టీ వీలుకల్పిస్తోంది. దాంతో ట్రాన్సేషన్ ఈజీగా జరుగుతుంది. ఒక వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా ఒకే ధర ఉంటుంది. ఇప్పటి మాదిరిగా ప్రాంతాన్ని, పన్ను రేటును బట్టి వస్తువు ధర మారిపోయే పరిస్థితి ఇకపై ఉండదు.

జీఎస్‌టీ రేటు ఎంత..?
జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జీఎస్‌టీ కౌన్సిల్‌ ఏర్పడుతుంది. ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. జీఎస్‌టీ రేటు ఎంత ఉండాలనేది ఈ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. జీఎస్‌టీ 18 శాతానికి మించరాదని కాంగ్రెస్‌ పార్టీ కోరుతుండగా, ప్రస్తుత ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుడు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇంకా అధిక రేటును నిర్ణయించాలని కోరుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సగటు ఏకీకృత పన్ను రేటు దాదాపు 20 శాతం ఉంది.

రద్దయ్యే  పన్నులు ఏవి..?
కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కేంద్ర ఎక్సైజ్‌ పన్ను, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, సేవల పన్ను, అదనపు కస్టమ్స్‌ పన్ను (సీవీడీ), కస్టమ్స్‌పై ప్రత్యేక అదనపు డ్యూటీ, కేంద్ర అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీ అండర్‌ మెడిసినల్‌ అండ్‌ టాయిలెట్రీస్‌ ప్రిపరేషన్‌ యాక్ట్‌ రద్దవుతాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యాట్‌/ అమ్మకం పన్ను, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్‌/ ఎంట్రీ ట్యాక్స్‌, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, లాటరీ- బెట్టింగ్‌- గ్యాంబ్లింగ్‌ పై విధించే పన్నులు రద్దవుతాయి.

వేటికి మినహాయింపు..?
అన్ని వస్తువులు, సేవలపై జీఎస్‌టీ ఉంటుంది. మద్యం, ముడి చమురు, హైస్పీడ్‌ డీజిల్‌, పెట్రోలు, సహజ వాయువు, విమాన ఇంథనం (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌) పై జీఎస్‌టీ ఉంటుందా లేదా ఉంటే ఏవిధంగా… అనే విషయంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటుంది.

Also Read:  జీఎస్టీ బిల్ కథ..

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
సైన్యం చేతికి టర్కీ
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
గుజరాత్ సిఎం రాజీనామా
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
మా టీవీ లైసెన్స్ లు రద్దు
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
రాజీనామాలు అప్పుడే
అమ్మకు ఏమైంది?
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నారా వారి నరకాసుర పాలన
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
యుపీలో ఘోర రైలు ప్రమాదం
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి

Comments

comments