అడుగుదూరంలో సింధు బంగారం

One Step to Get Gold Medal in Rio Olympics

తెలుగు తేజం ,బ్యాండ్మింటన్ మహిళా ప్లేయర్ పూసర్ల సింధు రియో ఒలంపిక్స్ లోకి ప్రవేశించింది. ఒలింపిక్స్ గేమ్స్ లో ఫైనల్ చేరిన మొట్ట మొదటి షట్లర్ గా చరిత్రకెక్కింది. సెమి ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి ఒకురాహో పైన 21-19,21-10 పాయింట్స్ తో వరుస రెండు గేముల్లో గెలవటం తో భారత జట్టుకి పతాకం ఖాయం అయింది. మొదటి గేములో హోరాహోరీగా సాగినా కూడా సింధు ఆధిపత్యం సాధించింది. ఇక రెండవ గేములో పూర్తి ఆధిక్యత సాధించింది. ఫైనల్లో చేరిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది. టెక్నిక్ కాన్ఫిడెన్స్ తో ఆకట్టుకున్న సింధు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించింది. ఒలింపిక్ చరిత్రలో భారత్ కు స్వర్ణాన్ని అందించే దిశగా సింధు కీలక అడుగు వేసింది.

సింధూ తల్లదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ కూతురి విజయాన్ని భారతీయులందరికీ, పుల్లెల గోపీచంద్‌కు అంకితం చేస్తున్నట్టు వారు చెప్పారు. సింధూ తండ్రి మాట్లాడుతూ.. తనకు గోపీచంద్ ముందే చెప్పారని సింధూను ఆపొద్దని చెప్పినట్టు తెలిపారు. గోపీచంద్‌కు తాను రుణపడి ఉన్నట్టు కూడా ఆయన అన్నారు. ఇంకా సింధూ తల్లి, సోదరి కూడా ఆమె విజయం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. రేపు జరగనున్న ఫైనల్స్‌లో కూడా గెలిస్తే భారత్‌కు సింధూ బంగారు పతకం అందించనుంది.

అద్భుతమైన ఆటతో రియో ఒలంపిక్స్ లో భారత్‌కు మరో పతకం సాధించిపెట్టిన పీవీసింధుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. తన ఆటతీరుతో భారత్ గర్వపడేలా చేశావని కొనియాడారు. ఫైనల్ పోరులోనూ ఇదే ఆటతీరుతో పోరాడి స్వర్ణంతో భారత్‌లో అడుగుపెట్టాలని ఆంకాంక్షించారు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం

Comments

comments