ఏపీ బంద్.. హోదా కోసం

Opposition Parties Called For AP State Bundh

ఏపీలో మూడురోజుల అసెంబ్లీ సమావేశాల నిమిత్తం.. అసెంబ్లీలో ఊహించినట్లుగానే యుద్ధ వాతావరణం తలపించింది. సభ మొదలుపెట్టిన కొద్దిసేపటికే 10 నిముషాలపాటు వాయిదా వేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో ప్రతిపక్ష నేతలు హోరెత్తించారు.

మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తన వైఖరి మార్చకుండా ఏపీ నెత్తిన టోపీ పెడుతూ ప్రత్యేక హోదా లేదు అని, ప్రత్యేక సహాయం మాత్రమే చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. దీనిపై వైకాపా సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడినప్పుడు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. వైకాపాది ద్వంద్వ వైఖరి అని, స్వప్రయోజనం తప్ప రాష్ట్ర ప్రయోజనం పట్టదని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని ఆక్రోశం వెళ్ళగక్కారు.

ఇదిలావుండగా.. సీఎం చంద్రబాబు, అరుణ్ జైట్లీ ప్రకటనలను ఆహ్వానించారని.. ఇది చాలా దారుణమని.. ప్రత్యేక హోదాపైనే చర్చ జరపాలని ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి పట్టుబడ్డారు. అధికార పక్షం టీడీపీ మాత్రం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయంపైనే చర్చ జరపాలని కోరింది. ప్రత్యేక హోదాకోసం కేంద్ర వైఖరిని నిరసిస్తూ.. ప్రతిపక్షాలు సెప్టెంబర్ 10న రాష్ట్ర బంద్‌కి పిలుపునిచ్చారు. దీనికి సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.

Related posts:
ఇదో విడ్డూరం
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
స్టే ఎలా వచ్చిందంటే..
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
వంద విలువ తెలిసొచ్చిందట!
గుదిబండగా మారిన కోదండరాం
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
కాంగ్రెస్ నేత దారుణ హత్య
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments