పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు

pakistan also preparing to ban big currency notes

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక చరిత్రలో అతి కీలకమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటి దాకా చలామణిలో ఉన్న అన్ని పెద్దనోట్లను రద్దు చేయడానికి మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తీక్షణంగా గమనించి మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో ప్రయాణించాయి. అందులో భాగంగా మొన్నీమధ్యన వెనిజులాలో పెద్దనోట్లను రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా భారత్ బాటలోనే పాకిస్థాన్ కూడా ప్రయాణించబోతోందని టాక్ నడుస్తోంది.

నల్ల ధనం నిర్మూలన కోసం భారత ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మాదిరిగానే పాకిస్థాన్‌లోనూ పెద్ద నోట్లు రద్దు చేయాలని అక్కడి ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. పాకిస్థాన్ సెనేట్‌లో ప్రస్తుతం చలామణిలో ఉన్న 5వేల నోటును రద్దు చేయాలని తాజాగా ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. మన దేశంలో వందకు పైగా ఉన్న అన్ని పెద్దనోట్లను అంటే 500, 1000నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే, పాకిస్థాన్ మాత్రం కేవలం 5వేల నోటు మీద మాత్రమే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది.

పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లాఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీనికి ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. ఈ నోటు రద్దుతో బ్యాంకు అకౌంట్ల వినియోగం పెరుగుతుందని.. అదే సమయంలో నల్లధనాన్ని నియంత్రించవచ్చని వారు పేర్కొన్నారు. మరో వైపు పెద్ద నోట్లను రద్దు చేసే మార్కెట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని.. ప్రజలు విదేశీ కరెన్సీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అక్కడి న్యాయశాఖ మంత్రి జాహిద్ హమీద్ తెలిపారు. మరి ఫైనల్ గా ఐదు వేల నోటును రద్దు చేస్తారో? లేదంటే వెనక్కి తగ్గుతారో చూడాలి.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
ఆటలా..? యుద్ధమా..?
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
స్థూపం కావాలి
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
జగన్ సభలో బాబు సినిమా
బెంగళూరుకు భంగపాటే
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ట్రంప్ సంచలన నిర్ణయం
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
మంత్రి గంటా ఆస్తుల జప్తు
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments