తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్….. భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి

Pakistan under pressure from World by India

అంతర్జాతీయ సమాజంలో భారత్ చేస్తున్న వత్తిడి పాకిస్థాన్ మీద బాగా బలంగా పనిచేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ చేపట్టిన విదేశాంగ విధానంతో పాకిస్థాన్ దాదాపుగా ఒంటిరిగా మారింది. పాకిస్థాన్ కు అనుకూలంగా ఏ దేశం కూడా ముందుకు రాకపోవడం, భారత్ కు బాసటగా అన్ని దేశాలు నిలుస్తుండటం.. భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చెయ్యడంతో పాకిస్థాన్ అడకత్తెరలో పోకలాగా నలిగిపోతోంది. పాకిస్థాన్ ముందు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కానీ తర్వాత మాత్రం భారత్ వత్తిడికి తలొగ్గింది. తాజాగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన కీలక ప్రకటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఉగ్రవాదానికి ముందు నుండి అడ్డాగా పాకిస్థాన్ మారిందని, పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదుల్ని ఎగుమతి చేస్తోందని భారత్ గట్టిగా వాదిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో సహా చాలా చోట్ల పాకిస్థాన్ అఫీషియల్ గా ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోందని ప్రపంచానికి భారత్ గట్టిగా నొక్కిచెబుతోంది. దాంతో పాకిస్థాన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పాక్ ఉన్నతాధికారులతో అత్యంత రహస్యంగా జరిగిన సమావేశంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ జైష్-ఇ- మహ్మద్‌తోపాటు ఇతర ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారని డాన్ పత్రిక తెలిపింది.

ఇటీవల దౌత్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌ పట్ల ప్రదర్శిస్తున్న ఉదాసీత గురించి ఈ సమావేశంలో ఆ దేశ విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌధురీ వివరించారని పేర్కొంది. దీంతో నవాజ్ షరీఫ్ పాక్ ఆర్మీకి నిషేదిత ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలని సూచించారు. అంతే కాకుండా గత జనవరిలో జరిగిన పఠాన్ కోట్ దాడుల దర్యాప్తుతోపాటు ముంబై దాడులకు సంబంధించిన దర్యాప్తును కూడా పునఃప్రారంభించాలని రావల్పిండి తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఆదేశించినట్లు డాన్ పత్రిక తెలిపింది. మొత్తానికి పాకిస్థాన్ మీద వత్తిడి ఎక్కువైంది అని అందరికి తెలుసు. దాన్ని తట్టుకోలేని పాక్ చివరకు చేసేదేమీ లేక టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపాలని ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ముంబై, పఠాన్ కోట్ దాడుల మీద కూడా విచారణ వేగవంతం చెయ్యాలని పాక్ నిర్ణయం తీసుకుంది. మరి చూడాలి పాక్ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తోంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
బాకీలను రద్దు చేసిన SBI
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
బంగారం బట్టబయలు చేస్తారా?
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments