ఇలా కాదు అలా… పాక్‌కు మంటపెట్టారు

Pakistan under pressure with American vote

యావత్ భారతం కోరుకుంటున్నది వేరే మార్గంలో జరుగుతోంది. ఉరీ ఘటనపై ఇప్పటికే దేశం మొత్తం పాకిస్థాన్ మీద యుద్ధాన్ని కాంక్షిస్తుంటే.. యుద్ధనీతితో కాకుండా రాజనీతితో పాకిస్థాన్ ను ఎదుర్కోవాలని భారత్ ఆలోచిస్తోంది. అందుకు నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన మీటింగ్ లో కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతానికి కొనసాగుతున్న పరిస్థితులు కొనసాగిస్తూ అవకాశం వచ్చినప్పుడు మాత్రం పాకిస్థాన్ కు తగిన పాఠం చెప్పాలని భారత్ గట్టిగా నిర్ణయించుకుంది. అందులో భాగంగా పాకిస్థాన్ చుట్టూ మెల్లిగా పావులు కదుపుతోంది.

యూరీ దాడుల ఉచ్చు పాకిస్థాన్ కు బిగుసుకుంటోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడ్డ పాక్.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా దృష్టిలోనూ కీలక దోషిగా మారింది. పాకిస్థాన్‌ను ‘ఉగ్రవాద ప్రోత్సాహక దేశం’గా పరిగణించాలంటూ అక్కడ డిమాండ్ లు పెరుగుతున్నాయి. అమెరికా  చట్టసభలోని ఇద్దరు సభ్యులు యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో దీనిపై బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పాక్‌ను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా గుర్తించాలని.. అమెరికా సాయం వెంటనే నిలిపేయాలని బిల్లులో పేర్కొన్నారు.

అమెరికా చట్టసభ ఉగ్రవాదంపై ఏర్పాటుచేసిన ఉపకమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న టెడ్‌ పోయ్.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన డానా రోహ్రబాచర్‌తో కలిసి టెడ్ పోయ్ ‘పాకిస్థాన్‌ స్టేట్‌ స్పాన్సర్‌ ఆఫ్‌ టెర్రరిజం డిజిగ్నేషన్‌ యాక్ట్‌’ (హెచ్‌ఆర్‌ 6069) బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమెరికా శత్రువులకు ఇస్లామాబాద్‌ కొన్నేళ్ల పాటు ఆశ్రయమిచ్చిందని.. ఒసామా బిన్‌ లాడెన్‌ అక్కడ తలదాచుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. దీన్ని బట్టి ఉగ్రవాదంపై పోరు అంశంలో పాకిస్థాన్‌ వైఖరి ఎలాంటిదో తెలుసుకోవడానికి అవసరానికన్నా ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయని టెడ్‌ ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు మద్దతుగా ఉంటామని తెలిపారు అమెరికా సభ్యులు.

పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తోందా లేదా అన్నదానిపై అధ్యక్షుడు ఒబామా పాలక వర్గం 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఆ తర్వాత 30 రోజుల్లో కార్యదర్శి జాన్ కెర్రీ దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని టెడ్‌ పోయ్ కోరారు. మరో కాంగ్రెస్ సభ్యుడు పీట్ ఓల్సన్ ఉరీ ఘటనను ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న వారిని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రతి చర్యకు తాను మద్దతిస్తానని ఆయన అన్నారు. దీన్ని చూస్తే పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఒంటరి అవ్వడానికి అంతా సిద్ధమైందని అర్థమవుతోంది.

Related posts:
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
సౌదీలో యువరాజుకు ఉరి
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
డబ్బు మొత్తం నల్లధనం కాదు
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments