బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది

Pakistani Beauty questions bullet

అసలే అందమైన అమ్మాయి ఆ మీద కత్తిలాంటి ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుంది. చాలా బావుంటుంది కదా.. మరి ఆ బ్యూటీ బుల్లెట్ నే ప్రశ్నిస్తే ఇంకెంతలా ఉంటుంది. బుల్లెట్ ను ప్రశ్నించడం ఏంటి అనుకుంటున్నారా..? బుల్లెట్ అంటే ఆర్మీ అనే అర్థంతో వాడాం. అవును ఓ అమ్మాయి ఆర్మీ చేస్తున్న నిర్వాకం మీద కడిగిపారేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అనుకుంటున్నారా.? ఆ బ్యూటీ మాట్లాడింది పాకిస్థాన్ ఆర్మీ గురించి. ఆమె కూడా పాకిస్థానీ బ్యూటీనే.

పాకిస్థాన్ అంటేనే టెర్రరిజానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది అని ప్రపంచంలోని అన్ని దేశాలు గట్టిగా నమ్ముతున్నాయి. తాజాగా ఇండియన్ ఆర్మీ క్యాంప్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం.. దానికి ప్రతిగా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. మొత్తానికి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ అమ్మాయి పాకిస్థాన్ లో జరిగిన మిలిటరీలో టెర్రరిజం పాత్ర అనే అంశంపై డిబేట్ లో ప్రశ్నించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ముందు నుండి అనుకున్నట్లుగానే పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తున్నారని ఆ బ్యూటీ ప్రశ్నించింది. పాకిస్థాన్ లో ఉగ్రవాదం పెరగడానికి కారణం ఏంటని ఆమె నిలదీసింది. అవినీతి రాజకీయ నాయకుల వల్ల వ్యవస్థ చెడిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఓ రకంగా దీనికి కారణమైన ప్రభుత్వం మీద కూడా ఆమె విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆమె మాట్లాడిన తీరు అందరిని కట్టిపడేసింది. అయితే ఈ డిబేట్ చాలా కాలం క్రితం నాటిది అని తెలుస్తోంది. తాజాగా భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా పాకిస్థాన్ లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని, ప్రభుత్వ వైఖరిని నిన్నటి దాకా బయటి వాళ్లు ప్రశ్నిస్తే.. ఇప్పుడు సొంత దేశం వాళ్లే ప్రశ్నిస్తున్నారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
ఆటలా..? యుద్ధమా..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
గెలిచి ఓడిన రోహిత్ వేముల
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
జియోకు పోటీగా ఆర్‌కాం
మోదీ ఒక్కడే తెలివైనోడా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

Comments

comments