అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది

Pakistani Media inappropriate stories on India

భారత్ పాకిస్థాన్‌ల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ కు చెందిన దాదాపుగా 19 మంది జవాన్లను పాక్ ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చారు. యావత్ ప్రపంచం దీనిపై దిగ్రాంభితిని వ్యక్తం చేసింది. పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించింది. భారత్ లో అయితే ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మీడియాలో భారత్- పాక్ యుద్ధం తప్పదు అన్న రేంజ్ లో వార్తలు రాశాయి. అమరల వీరులకు నివాళి ఘటిస్తూ వార్తలు ప్రసారమయ్యాయి. భారత్ లో పరిస్థితి ఇలా ఉంటే పాకిస్థాన్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడి మీడియా చేస్తున్న అతిని చూస్తే ఎవరికైనా చిర్రెత్తుకువస్తుంది.

పాకిస్థాన్‌లో ప్రముఖ పత్రికల నుండి చిన్న పత్రికలు, మీడియా వరకు వేసిన ఆర్టికల్స్ ను చూస్తే సగటు భారతీయుడికి ఖచ్చితంగా ఆవేశంరాక మానదు. జమ్ము కాశ్మీర్ లోని ఉరీ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మన సైనికులు వీర మరణం పొందారు. దీన్ని పాకిస్థాన్ మీడియాలో బాగా పాపులర్ అయిన డాన్ ఇలా వక్రీకరించింది ‘‘ భారత ఆక్రమిత కాశ్మీర్ లోని ఉరీ క్యాంప్ పై గుర్తు తెలియని దుండగుల దాడి, భారత సైనికుల హతం’’. ఇది అక్కడి మీడియా తీరు.

పాకిస్థాన్ పర్యటనలకు వెళ్లిన భారతీయులకు కూడా అక్కడి మీడియా వాళ్లు వేసే ప్రశ్నలు చాలా చిరాకు తెప్పిస్తుంటాయి. గతంలో వాజ్ పేయి పాక్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ మీడియా పర్సన్ ఇలా అడిగాడు ‘‘మా దేశం తరఫున శాంతి కోసం చర్యలు తీసుకుంటుంటాం.. కానీ మీరు ఎందుకు వాటిని స్వాగతించరు’’. దీనిపై వాజ్ పేయ్ ఘాటుగా స్పందించారు. ‘‘ముందుగా చరిత్ర తెలుసుకోవాలని, ఇప్పుడు పాకిస్థాన్ తో చేయి కలిపింది భారతేనని, కాల్పులకు ఎవరు పాల్పడతారో, శాంతికి ఎవరు భంగం కలిగిస్తారో ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేదేమీ లేదు’’ అని సమాధానమిచ్చారు.

‘భారత్ తో పాకిస్థాన్ శాంతి చర్చలకు సిద్ధపడుతుంటే.. భారత్ మాత్రం ఉగ్రవాదదాడుల సాకుతో తప్పించుకుంటోంది’ అని వార్తలు రాసింది అక్కడి మీడియా. అయినా జమ్ము కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. అంతేగానీ భారత ఆక్రమిత కాశ్మీర్ అనేది ఎక్కడా లేదు. పైగా భారత సైనికులపై గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు అని అక్కడ మీడియా రాసినప్పుడే.. పాక్ లో జర్నలిజం విలువ ఎంత దిగజారిందో తెలుస్తోంది. అయినా భారత్ లాంటి ఏనుగు మీద పాక్ లాంటి కుక్కలు, అక్కడి మీడియా కుక్క పిల్లలు మొరిగినంత మాత్రాన భారత్ కు పోయేదేమీలేదు.

Related posts:
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
ఆ అద్భుతానికి పాతికేళ్లు
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
సింధూరంలో రాజకీయం
పవన్ మాస్టర్ స్కెచ్
టాప్ గేర్ లో ముద్రగడ
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ఎవరు చాణిక్యులు..?
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
చెత్త టీంతో చంద్రబాబు
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
జగన్ క్రిస్టియన్ కాదా!
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

Comments

comments