పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

palanisamy won in assembly session voting

తమిళనాడు అసెంబ్లీలో చేపట్టిన బలపరీక్షలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామినే గెలిచారు. ఆయనకు మద్దతుగా 122 మంది సభ్యులు మద్దతు తెలపడం.. పళని గెలుపొందినట్లు స్పీకర్ ధన్‌పాల్ ప్రకటించారు. తొలుత సభలో ఈ పరీక్ష జరుగుతున్న సమయంలో డీఎంకే సభ్యులు నానా రాద్ధాంతం చేశారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రెండోసారి వాయిదా పడిన సభ.. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అయ్యింది. ఆ తర్వాత కూడా డీఎంకే సభ్యులు తమ పట్టు వీడలేదు. మరోసారి విధ్వంసం సృష్టించారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. మరోవైపు.. ఈ ఓటింగ్‌ని నిరసిస్తూ ముస్లింలీగ్ సభ్యులు కూడా వాకౌట్ చేశారు.

Also Read In English : Palanisamy Wins Vote For Confidence

ఈ క్రమంలో డివిజన్ ఓటింగ్ నిర్వహించగా.. పళనిస్వామికి 122 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ 117 మాత్రం. దీంతో.. పళనిస్వామి పాస్ అయ్యారని స్పీకర్ ధన్‌పాల్ వెల్లడించారు. ఈ బల పరీక్షలో నెగ్గి తన సీఎం సీటుని పదిలపరుచుకున్న పళనిస్వామి.. అసెంబ్లీ నుంచి నేరుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని, నివాళులు అర్పించారు. అమ్మ సమాధి వద్దకు రాగానే ఉద్దేగానికి లోనయిన ఆయన.. చిన్న పిల్లాడిగా భోరున విలపించారు. ఆయన్ను చూసి.. ఇతర ఇతర మంత్రులు, ఎమ్మెల్యే కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఇదిలావుండగా.. పన్నీరు సెల్వం తర్వాత జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పళనిస్వామి అందరి మన్ననలు అందుకున్నారు. ఎంజీ రామచంద్రన్ సిద్ధాంత పట్ల ఆకర్షితులై పళనిస్వామి ఏఐడీఎంకేలో చేరారు. ఈ పార్టీలో చీలిక వచ్చినప్పుడు.. జానకి రామచంద్రన్‌ను వ్యతిరేకిస్తూ, జయలలితకు మద్దతుగా పళనిస్వామి నిలిచారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడానికి పళనిస్వామి సామాజిక వర్గమే ప్రధాన కారణం.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
స్టే ఎలా వచ్చిందంటే..
ఈ SAM ఏంటి గురూ..?
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సౌదీలో యువరాజుకు ఉరి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
నారా వారి అతి తెలివి
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
రాసలీలల మంత్రి రాజీనామా

Comments

comments